సైకిల్ - కాంగ్రెస్ కుమ్మక్కు పంచాయతీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సైకిల్ - కాంగ్రెస్ కుమ్మక్కు పంచాయతీ

సైకిల్ - కాంగ్రెస్ కుమ్మక్కు పంచాయతీ

Written By news on Sunday, July 28, 2013 | 7/28/2013

 రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ఠగా నిలిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న ఓటర్లు, ముఖ్యంగా దళితులను ఓటింగ్‌కు రాకుండా భయబ్రాంతులకు గురిచేశాయి. అడ్డు, అదుపులేని అధికార దుర్వినియోగంతో ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేందుకు యధాశక్తి కృషిచేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ టార్గెట్ గా ముందస్తుగానే కొన్ని పంచాయతీలు పంచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల పరస్పర అవగాహనతో ఉపసంహరణలు, నామమాత్రపు పోటీలు, ఎన్నికైన తర్వాత పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవడం వంటి ఒప్పందాలకు పాల్పడ్డాయి. ఈ విడతలో 6,971 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇందులో తుది ఫలితాలు అందేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1319 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు కారణంగా ఆ రెండు పార్టీలకు వరుసగా 1941, 1806 స్థానాలు దక్కాయి. తొలిదశలో అంతగా ప్రభావం చూపించలేని టీఆర్ఎస్.. రెండోదశలో మాత్రం 590 స్థానాలలో విజయం సాధించగలిగింది. వామపక్షాలు, ఇతరులు కలిసి 822 పంచాయతీలలో గెలిచారు. 

విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసిన కాంగ్రెస్, టీడీపీలు కొన్నిచోట్ల వైఎస్సార్ సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై దాడులకు యత్నించాయి. పదివేలమందికి పైబడి ఉన్న మేజర్ పంచాయతీల్లో దాదాపు రూ.2 కోట్లు, వెయ్యి నుంచి రెండువేలలోపే ఉన్న మైనర్ పంచాయతీల్లో పాతిక నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేశారు. పంచాయతీల గెలుపు లెక్కలో ఆధిపత్యం కోసం చిన్నచిన్న పంచాయతీల్లో కూడా పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో 1974 మంది ఓటర్లున్న పోతవరం పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి అభ్యర్థి కోట్ల సువార్తమ్మను వైఎస్సార్సీపీ మద్దతుదారుపై గెలిపించేందుకు ఆ రెండు పార్టీల నేతలు దాదాపు రూ.25 లక్షలకు పైగా వ్యయం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు మేజర్ పంచాయతీలో 13,600 ఓట్లు ఉంటే ఒక్కో ఓటుకు రూ.1200 నుంచి రూ.1500 వరకూ కాంగ్రెస్, టీడీపీల అభ్యర్ధులు పంపిణీ చేశారు. అంటే ఒక్కో అభ్యర్ధి రూ.2 కోట్లకు పైగానే ఖర్చుచేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీని దక్కించుకోవడానికి టీడీపీ అభ్యర్థి రూ.60 లక్షల వరకూ ఖర్చుచేశారు. 

తొలి దశలో వర్షం కొన్ని ప్రాంతాల ఓటర్లను నిరుత్సాహపరిచినా.. ఈసారి వరుణుడు కరుణించడంతో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరి ఓటు వేశారు. ఈ విడతలో 6,971 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. వాస్తవానికి రెండో విడతలో 7,738 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏకగ్రీవాలు, వరదల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డవి, నామినేషన్లు దాఖలు కానివి, అభ్యర్థులు చనిపోయిన కారణంగా వాయిదా పడ్డవి కలిపి మొత్తం 1,001 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు.
Share this article :

0 comments: