రాష్ట్రానికి నాయకుడు జగనన్న ఒక్కడేనని తేలిపోయింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రానికి నాయకుడు జగనన్న ఒక్కడేనని తేలిపోయింది

రాష్ట్రానికి నాయకుడు జగనన్న ఒక్కడేనని తేలిపోయింది

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

రాష్ట్రానికి నాయకుడు జగనన్న ఒక్కడేనని తేలిపోయింది
 జగన్ కోసం - 432 రోజులు :  ప్రజానీకం పడుతున్నది జగన్ కోసం ఆరాటం.  జగన్ చేస్తున్నది ప్రజల కోసం పోరాటం.     అధికారం చేస్తున్నది అన్యాయపు తీర్మానం. జగన్‌లో ఉన్నది అలుపెరుగని సహనం. అవినీతి అక్రమాల చిరునామా ఈ సర్కారు. మళ్లీ మాదే విజయం అంటే జనం ఎలా నమ్ముతారు?   జగనన్న చుడతాడు కొత్త పాలనకు శ్రీకారం.    ఆ పాలన చూపుతుంది ప్రజలపైన మమకారం.  పంచాయితీ పోరులో తెలిసింది జగనన్న బలం. రాష్ట్రానికి నాయకుడు జగనేనని తెలిపింది ఈ ఫలితం.
 - సి.వి.వర్థన్, పరకాల, వరంగల్
 యువనాయకుడికున్న విజ్ఞత
 తలపండిన వృద్ధులకు లేకపోయింది!
 
 దేశ రాజకీయాలలో జగన్‌గారి జైలు నిర్బంధం ఒక సంచలనం. దేశంలోనే భారీ మెజారీటీతో గెలిచిన ఒక ఎంపీని, అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ముఖ్యమంత్రి తనయుడిని అకారణంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా జైలుకు పంపడం, ఏడాది దాటినా ఆయనకు బెయిలు రాకపోవడం అన్నివర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. మేధావులు, న్యాయనిపుణులు, రాజకీయాలలో తలపండినవారు, ఆఖరికి సీబీఐలోని కొందరు అత్యున్నతస్థాయి మాజీ అధికారులు సైతం జగన్ అరెస్టులో రాజకీయ కక్షసాధింపు కోణం ఉందని, ఒక ప్రజాస్వామిక దేశంలో ఇలా జరగడం దురదృష్టకరమని అనేక సందర్భాలలో వ్యాఖ్యానించారు. నిరూపణ కాని ఆరోపణలతో జగన్ జైలుకెళ్లితే, నిరూపించలేని ఆధారాలతో సీబీఐ న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తోంది! యువనాయకుడైన జగన్‌కు ఉన్నంత విజ్ఞత... కాంగ్రెస్‌లోని ఈ పెద్దలకు, తలపండిన తెలుగుదేశం నాయకులకు లేకపోయింది. దేవుడు అన్నీ చూస్తున్నాడంటారు. చూస్తే ఆయన ప్రజల కళ్లతోనే చూడాలి. పాలక, ప్రతిపక్షాలు పాల్పడుతున్న ఇన్ని ఘాతుకాలకు దేవుడే ప్రజల ద్వారా తీర్పు చెప్పిస్తాడు. జగన్‌ను, ఆయన కుటుంబాన్ని, వాళ్ల ద్వారా ప్రజల్నీ గట్టెక్కిస్తాడు.
 - శ్రీనివాసరావు, వేమవరం, గుంటూరు జిల్లా
 
 త్వరలోనే విడుదలై వస్తాడు
 ప్రజల తరఫున ప్రతిధ్వనిస్తాడు
 రాజన్న ప్రజల్ని వదిలి వెళ్లాక, జగనన్నను ఈ ప్రభుత్వం ప్రజలకు దూరం చేశాక రాష్ట్రం అస్తవ్యస్తం అయింది. ఛిన్నాభిన్నం అయింది. రాజకీయాలు తప్ప రైతులను పట్టించుకున్నవారే లేదు. ప్రగల్భాలు తప్ప నిరుపేదలకు ఒరిగిందేమీ లేదు. రాజన్న దయతో గెలిచినవారు నాడు పిల్లులుగా పడివుండి, నేడు పులులై జనంపై పంజా విసురుతున్నారు. జగనన్నని విమర్శిస్తున్నారు. రాజన్న రాజ్యం గుర్తుకొస్తేనే ఒక కలలా అనిపిస్తోంది. ఎంత మంచికాలం? ఆయన గనుక ఇప్పుడు ఉండి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేది. రైతులకు కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగేది. రాష్ట్రం కూడా రెండు ముక్కలయ్యేది కాదు. ఆయన చనిపోయాక ఆయన తనయుడొచ్చాడు, మాకిక దిగులేమిటి? భయమేమిటి? అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని, తెలుగుదేశం సహకారం తీసుకుని, సీబీఐని ఉసిగొలిపి జగన్‌ను అక్రమంగా జైలు పాలు చేసింది. ప్రజా సంక్షేమానికి పాటుపడగల ఒక సమర్థుడైన నాయకుడిని ప్రజల దరి చేరకుండా చేసింది. జనానికి, జగన్‌కి మధ్య ఏర్పడిన ఈ ఎడబాటు తాత్కాలికమే. త్వరలోనే ఆయన విడుదలై వస్తారు. ఆయనే తమ నాయకుడని ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటిస్తారు.  
 
 - ఉదయగిరి సుబ్బారావు, దాచారం పోస్టు, ఖమ్మం జిల్లా
Share this article :

0 comments: