రోజుకో మాట..ఇదే చంద్రబాబు బాట... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజుకో మాట..ఇదే చంద్రబాబు బాట...

రోజుకో మాట..ఇదే చంద్రబాబు బాట...

Written By news on Saturday, August 3, 2013 | 8/03/2013

రోజుకో మాట..ఇదే చంద్రబాబు బాట...
హైదరాబాద్: :
రాష్ర్ట విభజన అంశంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోజుకో మాట.. పూటకో పాట పాడుతున్నారని ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్ట విభజనకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉన్నా ఏమీ తెలియనట్టు అస్సలు పెదవే విప్పని చంద్రబాబు.. తీరా సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగడంతో వెంటనే వైఖరి మార్చేశారు. ఈ రకంగా పూటకో వైఖరి మార్చడం వల్ల ప్రజల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని ఇరు ప్రాంతాల నేతలు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. జూలై 1న హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని, పార్టీ సీనియర్ నేతలకు రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా చెప్పారు. విభజన ప్రక్రియపై ఆ తర్వాత జూలై 12, 26 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ అంశంపైనే చర్చించింది. రాష్ర్టంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ ఢిల్లీలోనే మకాం వేశారు. ఎంతో హడావిడి నడిచింది. ఇదంతా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం స్పందించలేదు. ఆ విషయాలేవీ తనకు పట్టనట్లు ఇంటికే పరిమితమయ్యారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు గతనెల 23న జరగ్గా ఆ ఎన్నికలకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వ్యవహారాలుగానీ, తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న హడావుడిపైగానీ నోరు విప్పలేదు. పంచాయతీ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడారు. తమ హయాంలో పంచాయతీలను ఎలా అభివృద్ధి చేసింది, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమి చేసేది చెప్పారే తప్ప రాష్ట్ర విభజనపై మాట్లాడనన్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన త ర్వాత మరోసారి విలేకరులతో మాట్లాడారు. అప్పుడు తమ గెలుపు గురించి వివరించారు. ఇదే సమయంలో విలేకరులు తెలంగాణ అంశం గురించి ప్రస్తావిస్తే... తాను ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడనని చెప్పారు. ఆ తరువాత కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే ప్రసంగించారు. తెలంగాణ గురించి ఎక్కడా మాట్లాడలేదు. 
 
నిర్ణయం ప్రకటించినా అదే మౌనం: గతనెల 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ సమావేశాల్లో కీలకమైన తెలంగాణపై నిర్ణయం ప్రకటించినా.. అప్పుడు కూడా ఏమాత్రం స్పందించకుండా చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు మాట్లాడతారని మీడియాకు సమాచారం పంపినా చివరి నిమిషంలో ఆయన విలేకరుల సమావేశానికి రాకుండా పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని పంపించారు. ఆ మరుసటి రోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరిగిన 31వ తేదీ చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. అప్పుడూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఏమీ మాట్లాడకుండా తెలంగాణకు అనుకూలంగా పార్టీ గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదని, అందుకు నాలుగు లక్షల కోట్ల నుంచి అయిదు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 అధిష్టానంతో ఆసాంతం ‘టచ్’లోనే: కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని, తెలంగాణకు అనుకూలంగా ఇదివరకిచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయం ప్రకటించిన తర్వాత చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ మళ్లీ మాట మార్చారు. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు ప్రతినిత్యం టచ్‌లో ఉన్నట్టు అందరికీ తెలిసిందే. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ గురువారం ప్రచురించినవార్త కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. కాంగ్రెస్ అధిష్టానం నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు ఢిల్లీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసినా రెండు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి పొందుతానని తనకేమీ పట్టనట్టు, సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. పైగా ఎవరూ నోరు విప్పొద్దని నేతలకు చెప్పారు.
 
 వెనుకపడిపోతామని రాజీనామాల డ్రామా: సమైక్యం కోసం సీమాంధ్రలో ఇంతపెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని చంద్రబాబు ఊహించలేదని, అందుకే కాంగ్రెస్ తెలంగాణపై ప్రకటన చేసిన రోజే సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగు లక్షల కోట్ల రూపాయలివ్వాలని మాట్లాడారని కోస్తా ప్రాంతానికి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయని, అయితే సీమాంధ్ర ప్రజల్లో తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమవడం, ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడంతో ఏం చేయాలో అర్థంకాక తెరవెనక నేతలను రాజీనామాకు పురమాయించారని ఆ నేత వివరించారు. ఉద్యమంలో పాల్గొనకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామన్న భయంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయాలని చెబుతున్నారని, ఈ రకంగా పూటకో వైఖరి అనుసరించడం వల్లే చంద్రబాబు ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తెలిసినప్పుడే స్పష్టంగా ఒక వైఖరి తీసుకోవడం, దానికి కట్టుబడి ఉండకపోవడం, ప్రతి విషయంలోనూ రాజకీయంగా పార్టీకి ఉపయోగమా? కాదా? అని బేరీజు వేసుకోవడం వంటి రంగులు మార్చే చర్యల వల్ల పార్టీ ఇరు ప్రాంతాల్లో పూర్తిగా అభాసుపాలైందని తాజా పరిణామాలపై పార్టీ నేతలు తలలు బాదుకుంటున్నారు.
Share this article :

0 comments: