ప్రజల నుంచి జగన్ ను దూరం చేయలేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల నుంచి జగన్ ను దూరం చేయలేరు

ప్రజల నుంచి జగన్ ను దూరం చేయలేరు

Written By news on Sunday, July 21, 2013 | 7/21/2013

ఒక మహానేత మరణం తర్వాత మన రాష్ట్రంలో ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చూడవలసి వస్తుందని ఎవరూ ఊహించలేదు. జగన్ పట్ల కాంగ్రెస్, టీడీపీలు వ్యవహరిస్తున్న ధోరణి... రాజకీయాల్లోని దిగజారుడుతనానికి పరాకాష్ట. రాష్ట్రంలో కాంగెస్‌పార్టీకి వరుసగా రెండుసార్లు పునరుజ్జీవనం ప్రసాదించిన నాయకుడి తనయుడిని కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని వేధింపులకు గురిచేస్తోందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో ఈస్థాయి విశ్వాసఘాతుకత్వం బహుశా స్వతంత్ర భారతదేశంలో ఇదే ప్రథమం కావచ్చు. ఓదార్పుయాత్రను ఆపలేదన్న ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం జగన్‌ని జైలుపాలు చేసింది. బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటోంది.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న ఒకే ఒక అజెండాతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలి మరీ ఈ పార్టీలు జగన్‌ను పట్టుకున్నాయి. వీళ్ల రాజకీయాలన్నీ జగన్ చుట్టూతానే తిరుగుతున్నాయి. వీరికి ఎల్లో మీడియా కూడా వంతపాడుతూ, తన వంతు పాత్రను పోషిస్తోంది. అయితే ఎవరెన్ని కూసుకున్నా, ఎవరెన్ని రాసుకున్నా ప్రజల హృదయాలలోంచి జగన్‌ని దూరం చేయలేరన్నది వాస్తవం. జగన్ త్వరలోనే విడుదలౌతారు. ప్రజలకు మళ్లీ ఆయన ఆత్మీయస్పర్శ దక్కుతుంది.

- యర్రం వెంకటరమణ, జీడిమెట్ల విలేజ్, హైదరాబాద్

కోట్ల ఆకాంక్షలు ఒక్కటై...జగనన్నను బంధ విముక్తుణ్ణి చేస్తాయి

ఒక మనిషి మీద ద్వేషంతో న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని, మానవత్వాన్ని, మంచితనాన్ని బంధించాలని చూస్తే... అది సాధ్యం కాదు. కోట్ల మనసులను గాయపరిస్తే... వారి హృదయస్పందన ఆవేశంతో ఒక్కటవుతుంది. అది కుయుక్తి రాజకీయాలను అడ్రస్ లేకుండా చెరిపేస్తుంది. అధికారం ఉందని న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తే... న్యాయదేవత కళ్లు తెరుస్తుంది, అదే కనుక జరిగితే నీచ రాజకీయాలు చేసే వారి పునాదులు కదులుతాయి. ఆ రోజు దగ్గర పడుతోంది. ఆ రోజు కోట్ల మంది ఆకాంక్షలు ఒక్కటై జగనన్నను బంధవిముక్తుడిని చేస్తాయి.

న్యాయం, ధర్మం, మానవత్వం, నీతి, నిజాయితీ కలిగిన జగనన్న ప్రజల మధ్యకు వస్తాడు. మా కష్టాలను, కన్నీళ్లను తుడిచేయడానికి మరో రాజన్నలా మా కోసం వస్తాడు.

- కె. రెడ్డెప్ప, ప్రశాంత్‌నగర్, మదనపల్లి, చిత్తూరు జిల్లా

మసిబట్టలో చుట్టిపెడితే మాత్రం...రత్నం విలువ తగ్గిపోతుందా?!

ఆప్తులు, అభిమానులు, హితైషులు, బంధువులు, స్నేహితులు, ప్రజాసేవకులలో ఎవరైనా బాధలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా వెళ్లి పరామర్శించడం, ఒకవేళ వారికి ఏదైనా జరగరానిది జరిగితే వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం భారతీయ సంప్రదాయం. మానవ నైజం కూడా. రాజశేఖరరెడ్డి గారు దుర్ఘటనలో అకస్మాత్తుగా మరణిస్తే ఆ బాధను భరించలేక వందల మంది గుండెలు పగిలి చనిపోయారు. వారి కుటుంబాలను ఓదార్చడం ఆయన కుమారుడిగా తన ధర్మం అని భావించారు జగన్. అయితే ఆయన చేపట్టిన ఓదార్పుయాత్రకు అసంఖ్యాకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూసి కాంగ్రెస్ పాలకులకు, విపక్షాలకు ముచ్చెమటలు పట్టాయి. దాంతో జగన్ ప్రభంజనాన్ని తట్టుకునేందుకు సీబీఐ సహకారంతో ఆయన్ని అరెస్ట్‌చేయించి, బెయిల్ రాకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతున్నారు.

సీబీఐ వేయిపడగల పాము అని, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని, కాంగ్రెస్‌ను ధిక్కరించేవారిని ఆ పాము కాటు వేస్తుందని ప్రజలు, న్యాయాధీశులు కూడా గ్రహించారు. ఢిల్లీ అమ్మగారి ఆదేశంతో చంద్రబాబు గారి డెరైక్షన్‌లో ఈ సీబీఐ... ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తూ జగన్‌ని జైల్లోనే ఉంచేందుకు ఎప్పటికప్పుడు పావులు కదుపుతోంది. చంద్రబాబు, ఆయన మీడియా మిత్రులు ఏది చెబితే అదే సీబీఐ ఆటగా, పాటగా, బాటగా మారాయి. చంద్రబాబు మెప్పుకోసం, పార్టీలో ప్రాపకం కోసం కొందరు తెలుగుదేశం నాయకులు జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. జీవితఖైదు వేయాలని ఒకరు, పద్నాలుగేళ్ల జైలని ఒకరు, ఇక బయటికి వచ్చే పరిస్థితి లేదని ఇంకొకరు డోలు వాయిస్తున్నారు.

ఒక మంత్రిగారైతే ఏకంగా జగన్‌ను ఉరి తీయాలని తీర్పు చెప్పారు! మరికొందరైతే జగన్ కుటుంబ మత విశ్వాసాలపై ఏకంగా వ్యక్తిగత విమర్శలకే దిగారు. ఈ మాటలన్నిటినీ ప్రజలు ఈసడించుకుంటున్నారు. వీళ్లేం నాయకులని ఛీత్కరిస్తున్నారు. వీటన్నిటినీ జగన్, ఆయన కుటుంబం ఎంతో సహనంతో భరిస్తున్నట్లు అర్థంచేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ కాంగెస్, టీడీపీ నాయకులు మళ్లీ నోరెత్తడానికి వీల్లేనివిధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నది స్పష్టం. జగన్ పున్నమినాటి చంద్రుని వలె పండు వెన్నెలలో, చల్లని చూపులతో బయటకు వస్తారు. ఇది కోట్లాదిమంది ప్రజల ఆకాంక్ష. వాక్కు. మసిబట్టలో చుట్టిపెట్టినా రత్నం విలువ తగ్గుతుందా? జగన్ జైల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గదు.

- వి.రుక్మిణీదేవి, బెంగళూరు
Share this article :

0 comments: