అయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని నిలువరించలేకపోయాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని నిలువరించలేకపోయాయి

అయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని నిలువరించలేకపోయాయి

Written By news on Wednesday, July 24, 2013 | 7/24/2013

అధికార, ప్రతిపక్షాలు మళ్లీ కుమ్మక్కయ్యాయి
ఉమ్మడి అభ్యర్థులను నిలిపాయి...
పరస్పరం ఓట్లు బదిలీ చేసుకున్నాయి...
బెదిరింపులకు పాల్పడ్డాయి...
కోట్ల కొద్దీ డబ్బులు కుమ్మరించాయి...
విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశాయి...
అయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని నిలువరించలేకపోయాయి. 

గ్రామ సంగ్రామంలో వైఎస్సార్ సీపీ విజయ దుందుభి మోగించింది. గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో.. ఏకగ్రీవంగా గెలిచిన స్థానాలు, మంగళవారం నాటి తొలిదశ ఎన్నికల్లో గెలిచిన స్థానాలు కలుపుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ విజేతగా నిలిచింది. పార్టీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను గెలుచుకోవటంతో పంచాయతీ పోరులో అగ్రస్థానంలో నిలబడింది. వైఎస్సార్ సీపీని ఓడించే ఏకైక లక్ష్యంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నో కుట్రలు అమలు చేశాయి. అసలు పంచాయతీ ఎన్నికలకన్నా ముందు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అవి పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావటంతో అధికార కాంగ్రెస్ వాటిని వెనక్కు నెట్టేసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చి నిర్వహించింది. 

పతిపక్ష పార్టీతో ఎన్నికల కుమ్మక్కును కొనసాగించింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రెండు పార్టీలూ విశ్వప్రయత్నాలు చేశాయి. చివరికి కౌంటింగ్ సమయంలో సైతం మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చాలా చోట్ల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అవేవీ పనిచేయకపోవటంతో.. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన సర్పంచులను సైతం ప్రలోభపెట్టి, బెదిరించి, భయపెట్టి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేశాయి. 

ఈ నాటకానికి ఎల్లో మీడియా కూడా వత్తాసు పలికింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు అసలు వెల్లడి కాకముందే.. కాంగ్రెస్, టీడీపీలకే ఎక్కువ స్థానాలు దక్కాయంటూ ప్రచారం మొదలుపెట్టింది. కానీ.. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రపూరితంగా ఏడాదిన్నర కాలంగా జైలులో నిర్బంధించిన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో.. పల్లె సీమల ప్రజానీకం తమ ఓట్లతో అధికార, విపక్షాల కుతంత్రాలను తిప్పికొట్టారు. వైఎస్సార్ సీపీని ఆదరించి అత్యధిక పంచాయతీల్లో గెలిపించటం ద్వారా.. జగన్‌ను విజేతగా ప్రకటించారు. రెండేళ్ల కిందటే ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. నూరేళ్ల చరిత్ర గల అధికార పార్టీని, మూడున్నర దశాబ్దాల చరిత్ర గల ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఢీకొని.. ఆ రెండు పార్టీలనూ వెనక్కునెట్టి.. విజయబావుటా ఎగురవేయటం ఈ ఎన్నికల ప్రత్యేకత. వర్గాలు ప్రధాన పాత్ర పోషించే గ్రామాల ఎన్నికల్లో కేవలం రెండేళ్లలోనే వైఎస్సార్ సీపీ విస్తృత ప్రజాభిమానం సంపాదించుకోవటం విశేషం. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రత్యర్థి పక్షాలపై విస్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. పార్టీ వ్యవస్థాగత నిర్మాణం ఇంకా పూర్తిగా బలపడనప్పటికీ తెలంగాణ జిల్లాల్లో సైతం గణనీయమైన విజయాలు సాధించింది. చాలా స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీ ఇచ్చింది. కొన్నిచోట్ల కేవలం నాలుగైదు ఓట్ల తేడాతోనే విజయానికి దూరమయింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తనకు గట్టు పట్టు ఉందని చాటుకుంది. 
Share this article :

0 comments: