జగన్ అమేయ శక్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అమేయ శక్తి

జగన్ అమేయ శక్తి

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

14నెలల అక్రమ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘనే
కాంగ్రెస్ అధినేత్రి సోనియా తీరుపై నిప్పులు
నూజివీడు సాక్షి చైతన్యపథంలో మేధావులు, వక్తలు

సాక్షి, నూజివీడు : ‘జగన్ గుండెల నిండా జనం ఉన్నారు. అందుకే జైలుపాల్జేసినా కుంగిపోలేదు.. ఢిల్లీ కుట్రలకు లొంగలేదు. జగన్‌ను లొంగదీసుకోవాలని జైలులో పెట్టిన వారే కుంగిపోయే రోజులు ముందున్నాయి.’ అని కాంగ్రెస్, సీబీఐ కుట్రలపై నూజివీడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది మన న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రం. దీనికి భిన్నంగా నేరారోపణ రుజువు కాకుండానే శిక్ష వేసినట్లు 14 నెలలుగా బెయిల్ ఇవ్వకుండా జగన్‌ను జైలులోనే ఉంచారు. ఓటు అనే ఆయుధంతో జననేత జగన్‌ను బయటకు తెచ్చుకుంటామని చెప్పారు. కృష్ణాజిల్లా నూజివీడులో సోమవారం సాక్షి చైతన్యపథం జరిగింది. డీవీఎన్ కిషోర్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ సదస్సులో ప్రముఖ న్యాయవాది బసవరాజు రామకృష్ణ మాట్లాడుతూ చట్టంలోని చిన్న లొసుగును అడ్డంపెట్టుకుని సీబీఐ ఎప్పటికప్పుడు కొత్త చార్జీషీట్లు వేయడం దారుణమని విమర్శించారు. సుప్రీంకోర్టు మందలించినా సీబీఐ తీరులో మార్పురాలేదని, తప్పుడు కేసులతో కాలం వెళ్లదీస్తోందని చెప్పారు. 

స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆర్‌ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఈ కేసులన్నీ జగన్‌ను రాజకీయంగా అణచివేసేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. నేరాలు చేసిన వ్యక్తులు బయట దర్జాగా తిరుగుతుంటే అభియోగం మోపబడిన వ్యక్తిని 14 నెలలుగా ప్రజలకు దూరం చేయడం కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనే అని మండిపడ్డారు. డాక్టర్ జి.రామారావు మాట్లాడుతూ కుంటిసాకులు చెబుతూ బెయిల్ రాకుండా చేయడం, విచారణ పేరుతో జైలులో ఉంచడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని చెప్పారు. అరసం నేత శిఖా ఆకాష్ మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ఆరోపించారు. గృహిణి శ్రీలత మాట్లాడుతూ సోనియాగాంధీ చెప్పినట్లు సీబీఐ ఆడుతోందని విమర్శించారు. కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పీవీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఒక సునామీలా జగన్ జనం ముందుకు వస్తారని ఆకాంక్షించారు. ఆంధ్రాలో హస్తం గుర్తు, ఢిల్లీలో పాదం గుర్తుగా వ్యవహరించే నాయకులు కాంగ్రెస్‌లో ఎక్కువయ్యారని దుయ్యబట్టారు. ఇక్కడ కార్పొరేటర్లుగా గెలవలేని వారు సోనియా కాళ్లపై పడి రాజ్యసభ సభ్యులయ్యారని, ఆమెను ఎదిరించినందుకే జగన్‌ను జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనం కసిగా ఎదురుచూస్తున్నారని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
Share this article :

0 comments: