వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కమిటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కమిటీ

వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కమిటీ

Written By news on Monday, April 30, 2012 | 4/30/2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఏర్పడిన వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ర్ట కార్యవర్గాన్ని అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ సోమవారం నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అనుమతితో ఈ కమిటీని నియమించినట్లు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మరో నాలుగు జిల్లాలకు ట్రేడ్‌యూనియన్ విభాగం కన్వీనర్లను కూడా ఆయన నియమించారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడు : బి.జనక్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎం.బాబూరావు, బి.ఓబుళరెడ్డి, కె.అప్పారాఉ, ప్రధాన కార్యదర్శి : పి.నరసింహారెడ్డి, కార్యదర్శులు : ఎన్.హరికృష్ణ, ఏ.రాజారెడ్డి, సిహెచ్.రవీంద్రరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యద ర్శులు : సిహెచ్ మనోరంజని , ఎన్.రవిప్రసాద్, ఎల్.రామలింగారెడ్డి, కోశాధికారి : పి.మాధవ నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు : హుస్సేన్ వలీ, ఎస్.చిన్నప్పరెడ్డి, జి.వెంకటరెడ్డి, జి.విశ్వేశ్వర్‌రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మహ్మద్ జుల్ఫికర్ అలీ, ఆర్.మునిగురవారెడ్డి, ఏ.సత్యనారాయణ రాజు, సిహెచ్.రాఘవబాబు, వి.ఏ.జగదీష్, సి.నాగిరెడ్డి, జి.ఎన్.ఎస్.మూర్తి, సి.సంజీవరెడ్డి, వేమూజి బండిష్, జోగు వెంకటరెడ్డి, రత్న మాయ, సి.పి.వీరన్న, మోరా పిచ్చిరెడ్డి, ఎం.ఎస్.వి.ఆర్.మూర్తి, ఎన్.నవీన్‌కుమార్, ఎస్.ఎం.సుభాని, కె.నాగేశ్వరరావు, జి.రమణ, దేవి భూమయ్య, పుల్లూరి లక్ష్మణ్, గుమ్మడి కుమార్ స్వామి, లింగమూర్తి, వల్లెపు వారాప్రసాద్, షేక్ ఇస్మాయిల్, గోటూరు చిన్నప్ప, కాళ్ల భాస్కర్, దుగ్గసాని ప్రభాకర్‌రెడ్డి, దాసిరెడ్డి గంగాధర్‌రెడ్డి, ఎస్.శ్రీనివాసరెడ్డి, జాషువా, సురేష్, జి.మేహ శ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అనసూయ, శివారెడ్డి, మురళీధర్ శర్మ, వి.నారయ్య. జిల్లా కన్వీనర్లు :వేజండ్ల శివశంకర్‌రావు (కృష్ణా), అన్నాబత్తిని సదాశివరావు(గుంటూరు), నీలాపు శివారెడ్డి (విశాఖపట్టణం-అర్బన్), జోగు వెంకటరెడ్డి (నల్లగొండ). మేడే ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నూతన కమిటీని నియమించినట్లు జనక్ ప్రసాద్ తెలిపారు. 

హెచ్‌ఎంటీ బేరింగ్స్ వద్ద తొలి సభ
తొలిసారిగా వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ ఆధ్వర్యంలో మౌలాలిలోని హెచ్‌ఎంటి బేరింగ్స్ వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు మేడే ప్రధాన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జనక్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయనీ కార్మిక లోకంలో వాటిని చాటి చెప్పి తమ ట్రేడ్‌యూనియన్ పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. పెట్టుబడుల ఉపసంహరణ, కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ, కనీస వేతనాలు లేక పోవడం, కార్మిక సంఘాలను నిర్లక్ష్యం చేయడం వంటి విధానాలు ప్రభుత్వాలు కొనసాగిస్తున్న తరుణంలో తమ ట్రేడ్‌యూనియన్ ఒక భరోసాగా ఉంటుందని ఆయన అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనుసరించిన కార్మిక అనుకూల విధానాలపై కూడా ప్రచారం చేస్తామని అన్నారు. తొలి మేడే ఉత్సవాల్లో మంగళవారం వైఎస్సార్ పార్టీ జెండానే ఆవిష్కరించాలని ఆయన జిల్లా విభాగాలకు పిలుపు నిచ్చారు. 
Share this article :

0 comments: