‘టీవీ 5’ ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్‌కుమార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘టీవీ 5’ ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్‌కుమార్

‘టీవీ 5’ ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్‌కుమార్

Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013

‘టీవీ 5’ ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్‌కుమార్
ప్రత్యర్థుల బురద మాకంటుకోదు
దేవుడి అండ, ప్రజాబలం ఉంది

సాక్షి, హైదరాబాద్: తాము ధర్మయుద్ధంలో ఉన్నామని, దేవుడు అన్నీ చూస్తున్నాడని, ప్రత్యర్థులు తమపై ఏ స్థాయిలో బురద చల్లినా... ప్రజల విశ్వసనీయత చూరగొన్న తమ కుటుంబానిదే అంతిమ విజయం అవుతుందని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. గత కొంత కాలంగా బీజేపీ, టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బ్రదర్ అనిల్‌కుమార్ ఘాటుగా స్పందించారు. వారి ఆరోపణల్లో పస లేదని, తమ కుటుంబాన్ని అపప్రథల పాలు చేసేందుకే వారు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

బెనీటా, రక్షణ లాంటి పలు కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను నమ్మే దైవం, పిల్లలపై ప్రమాణం చేసి చెప్తున్నానని, ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు కూడా వారి పిల్లలపై ప్రమాణం చేసి మాట్లాడగలరా? అని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం ఆయన ‘టీవీ 5’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మరో ప్రజాప్రస్థానం’ ద్వారా షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయకుట్రలో భాగంగానే తనపై విమర్శలు వస్తున్నాయని, వాటికి ఎల్లో మీడియా మరింత రంగు అంటిస్తోందని ఆయన అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, సొంత మామనే వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకుడైన వ్యక్తి బాబు అని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజాసమస్యలు పట్టవని, ఎదుటివారిపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంటారన్నారు. 

ఆయన తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలకు మంచి చేశానని గుండెపై చేయి వేసుకొని చెప్పగలరా? అంటూ ధ్వజమెత్తారు. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు మరొకరుండరని వ్యాఖ్యానించారు. ‘సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్లం. నిజాలను నమ్మే వ్యక్తులం. ఇలాంటి కుట్రలు మా కుటుంబానికి కొత్తకాదు. ఎవరెన్ని విమర్శలు చేసినా అవేవీ మమ్మలి కదిలించలేవు’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చేయడం లేదా వ్యాపారం: ‘బిజినెస్‌ల విషయంలో నాపై వస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. అయితే నాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. బిజినెస్ చేయడం తప్పా? చంద్రబాబు చేయడం లేదా వ్యాపారం. నా కంపెనీలకు సంబంధించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద సమగ్ర సమాచారం ఉంది. 11 కంపెనీలలో ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. 

నా కంపెనీలు 2004కు ముందున్నవే కదా ఇప్పుడు నడిచేవి. వైఎస్ సీఎం అయ్యాక వ్యాపారం చేశానన్నది పూర్తి అవాస్తవం. అంతేకాదు నా ఐటీకి సంబంధించి పత్రాలు అన్నీ కూడా సీబీఐ తీసుకుంది. వారి దగ్గర సమగ్ర సమాచారం ఉంది కదా...’ అని అన్నారు. బయ్యారం గనులకు సంబంధించి వారు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అందులో చాలా కాస్టు ఐరన్ ఉందని, చాలా కంపెనీలు బిడ్డింగ్‌లో కూడా పాల్గొనలేదని, టీడీపీనేత సుజనాచౌదరి కంపెనీ కూడా బిడ్డింగ్‌లో పాల్గొనలేదని వివరించారు. ఐఎంజీ అనే సంస్థకు చంద్రబాబు భూములు కట్టబెట్టిన మాదిరిగా రాజశేఖరరెడ్డి ఏనాడు ప్రవర్తించలేదని, నియమ నిబంధనలు కచ్చితంగా పాటించారని తెలిపారు. కొండల్‌రావు అనే వ్యక్తి తనకు మంచి మిత్రుడు మాత్రమే అని, ఆయనతో ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. బినామీలను పెట్టుకునే అవసరం తనకు లేదన్నారు. వీరభద్రరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అలాంటిది ఆయన సూసైడ్‌ను అంటగట్టడం చూస్తుంటే రాజకీయాలను నీచమైన స్థాయికి దిగజార్చుతున్నారని మండిపడ్డారు.

అవన్నీ కారుకూతలే: టీడీపీ, బీజేపీనేతలు చేసేవన్నీ కారు కూతలేనని, వారి అబాంఢాలకు హద్దులేకుండా పోతోందని అనిల్ స్పష్టం చేశారు. ‘షర్మిల కారు ప్రస్తావన తెస్తున్నారు. కొండల్‌రావుది ఆడి క్యూ5సీజీ, మాది ఆడి క్యూ7సీజే. కంపెనీ ఒకటే అయినంత మాత్రాన ఒకే గాటన కడతారా? అలాగైతే దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో సైకిల్‌ను వాడారట. టీడీపీ సింబల్ సైకిల్ అని వారికి అంటగడతారా? అలా చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. విమర్శలు చేసే వారు కొద్దిగా ఆలోచించాలి...’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాజకీయంగా ఎదుర్కోలేకనే: వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే తమపై దుష్ర్పచారం చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. ప్రజాభిమానం కూడగట్టుకున్న జగన్‌ను దెబ్బతీయడానికి అక్రమంగా నిర్బంధించడమేగాక, నెలలు గడుస్తున్నా బెయిల్ రాకుండా కుమ్మక్కు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాభిమానం పొందలేని చంద్రబాబు... వైఎస్ అన్నా, వైఎస్ కుటుంబమన్నా అసూయ, అక్కసు వెళ్లగక్కుతుంటారని అందుకే తన మనుషులతో నిత్యం విషప్రచారం చేయిస్తున్నారన్నారు.
Share this article :

0 comments: