నరసరావుపేటలో షర్మిలకు బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నరసరావుపేటలో షర్మిలకు బ్రహ్మరథం

నరసరావుపేటలో షర్మిలకు బ్రహ్మరథం

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

ఎండైనా....వానైనా ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు జనహోరు కొనసాగుతూనే ఉంది. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ వైఖరికీ, దానికి అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికీ నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల ‘మరోప్రజాప్రస్థానం’ పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలో కొనసాగింది.

ప్రజలు అడుగడుగునా షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. తొలుత సత్తెనపల్లి నియోజకవర్గం గోళ్లపాడు గ్రామ శివారులోని బస కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. నియోజకవర్గ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి తదితరులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అప్పటికే భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా, అధిక సంఖ్యలో ప్రజలు షర్మిలతో కలిసి అడుగులు వేశారు. అక్కడ నుంచి పాదయాత్ర రెండు కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట నియోజకవర్గం ములకలూరు గ్రామంలోకి ప్రవేశించింది.

అక్కడ జరిగిన రచ్చబండలో షర్మిల ప్రసంగించారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ కోతలు, పెరుగుతున్న ధరలతో బతకలేకపోతున్నామని, మహానేత వైఎస్ హయాంలో తమ బతుకులు బాగున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన షర్మిల మాట్లాడుతూ జగనన్న పాలన త్వరలో వస్తుందని, రాజన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాడని, పథకాలన్నీ తిరిగి అమలులోకి వస్తాయని భరోసా ఇచ్చారు. అనంతరం ఇస్సపాలెం బీసీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. మహంకాళీ అమ్మవారి ఆలయం వద్ద షర్మిలకు పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. 

సాయంత్రం వరుణుడి ఆగమనం...
తిరిగి సాయంత్రం ప్రారంభమైన పాదయాత్రకు ప్రకృతి అనుకూలించింది. ఉదయం తన ప్రతాపాన్ని చూపిన భానుడు సాయంత్రం చల్లబడ్డాడు. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చల్లని వాతావారణం నెలకొంది. షర్మిల నడిచే దారి పొడవునా గ్రామస్తులు పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సమయంలో పాదయాత్రకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు రెట్టింపు సంఖ్యలో తరలిరావడంతో సత్తెనపల్లి, నరసరావుపేట ప్రధాన రహదారి జనసందోహంతో కిక్కిరిసిపోయింది. 

పాదయాత్రకు వెనకా, ముందు రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా జనం కనిపించారు. దారి పొడవునా కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. బరంపేట బైపాస్‌రోడ్డు మిట్టబజారు వద్ద ఉన్న మహానేత వైఎస్‌ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే సమయంలో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. వర్షంలోనే తడుస్తూ షర్మిల బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వర్షం పెరిగినా ఎటూ కదలని ప్రజలు తడుస్తూనే ఆమె ప్రసంగాన్ని ఆలకించడం విశేషం.

షర్మిల ప్రసంగానికి విశేష స్పందన ...
పాత పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో షర్మిల అధికార, ప్రతిపక్ష పార్టీలపై చేసిన ఘాటైన విమర్శలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహానేత వైఎస్, టీడీపీ అధినేత నారా చంద్రబాబుల పాలనలోని వ్యత్యాసాలను గణాంకాలతో సహా వివరించడం ప్రజలను ఆకట్టుకుంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగనన్నను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని, అప్పటి వరకు మీరంతా సహకరించాలని, జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.
Share this article :

0 comments: