స్కామ్‌లలో కూరుకుపోయినవారే జగనన్నపై బురద చల్లుతున్నారు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్కామ్‌లలో కూరుకుపోయినవారే జగనన్నపై బురద చల్లుతున్నారు!

స్కామ్‌లలో కూరుకుపోయినవారే జగనన్నపై బురద చల్లుతున్నారు!

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013


పజాభిమానం తప్ప, ఏ అధికార పదవులూ లేని యువ నాయకుడు... అధికార, ప్రతిపక్ష దుర్నీతికి బలై, జైల్లో ఉండి కూడా జనం హృదయస్పందన కావడం... ఈ శతాబ్దంలో ప్రపంచంలో మరెక్కడా లేని, మనం చూడబోని గొప్ప సంఘటన. జగన్ చెల్లెలుగా మాత్రమే పాదయాత్ర చేస్తున్న షర్మిలకే ఇంతటి ప్రజాదరణ ఉందంటే, జగన్ బైటికి వస్తే, మిగతా పార్టీలకు పుట్టగతులుండవు అన్న సంగతి జనానికి స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే - కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, స్కామ్‌లలో కూరుకుపోయి విలవిల్లాడుతూ కూడా, తాము సచ్ఛీలురమని, జగన్ మాత్రమే అవినీతిపరుడని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ఛీ కొడుతున్నారు. ప్రజలు ఎంతో చైతన్యవంతులు.

అవకాశం వచ్చిన ప్రతిసారీ సరైన తీర్పు చెబుతూనే ఉన్నారు. ఇకనైనా కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు తమ కుట్రలు, కుతంత్రాలు మాని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే, రాబోయే ఎన్నికలలో కనీసం డిపాజిట్‌లైనా వారికి దక్కుతాయి. ప్రతిపక్ష నాయకుడి అవినీతి ప్రస్ఫుటంగా కళ్లెదుట కనిపిస్తున్నా, ప్రజలందరూ అర్థం చేసుకున్నా.. మన దర్యాప్తు సంస్థలకు కనిపించకపోవడం చాలా దురదృష్టకరం. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, అధికారపార్టీ ఆలోచనా విధానాన్ని బట్టి దర్యాప్తు సంస్థల తీరుతెన్నులు ఉన్నాయన్న భావన సగటు మనుషుల్లో ఉంది. ఆ భావనలో వాస్తవం ఉంటే గనుక అంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదేమో. ఏది ఏమైనా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన తీర్పు మాత్రం కచ్చితంగా జగన్‌కే అనుకూలంగా వస్తుంది.

- ఎస్. జమ్‌రుద్ బేగం, హైదరాబాద్

కట్టడి చెయ్యడం... కుట్ర కాక మరేమిటి?!

మహానేత దూరమైతే అది తట్టుకోలేక బాధతో తనువు చాలించిన కుటుంబాలకు ‘నేనున్నానని’ భరోసా ఇస్తే అది పాపం! నీళ్ల కోసం ఎండమావులను వెదుక్కుంటూ వెళ్లే రైతుల పోరాటానికి మద్దతు ఇస్తే అది నేరం! విద్యార్థుల ఆశలు అడియాశలు అవుతున్న తరుణంలో వారి భుజాలపై చెయ్యి వేసి వారికి న్యాయం చేయబోతుంటే అది అన్యాయం! అహంకారానికి, అధికారానికి ఎదురొడ్డి పోటీ చేస్తే అది అప్రజాస్వామికం! ఆరోగ్య పథకాలను అనారోగ్యం పాలు చేస్తున్న నిర్ణయాలను నిలదీస్తే అది ధిక్కారం! ఇదంతా చూస్తుంటే ఎంతో చోద్యంగా ఉంది కదూ. అవును మనం ఇప్పుడు ‘కాంగ్రెస్ ఇష్టారాజ్యం’లో ఉన్నాం. ఆ రాజ్యం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారి బతుకు జైలు పాలే. ఇది కథల్లో చదివింది కాదు, సినిమాల్లో చూసింది కాదు.

జగనన్న జీవితంలోని వాస్తవం. ఇంతకీ జగనన్న చేసిన తప్పేమిటంటే - మన నాయకుల ఒంటెత్తు పోకడలను వ్యతిరేకించడమే. ఫలితం? జగనన్నపై అక్రమకేసులు, తొమ్మిది నెలలుగా అక్రమ నిర్బంధం. మెయిలు పంపించినంత సులభంగా బెయిలు దక్కించుకుంటున్న ఈ రోజుల్లో కూడా... జగనన్నను జనం మధ్యలోకి రానివ్వకుండా ఉంచేందుకు ఆయన్ని కట్టడి చెయ్యడం... నీచ రాజకీయాలకు ఒక నిదర్శనం. బంతి బలంగా గోడకు కొడుతున్నామన్న ఆలోచనే ఉంది గాని, అది వేగంగా తిరిగి వారి వైపుకే దూసుకొస్తుందన్న కనీస జ్ఞానం లేకుండా పోయింది ఈ కాంగ్రెస్‌కు. రామన్న రాజ్యం తీసుకువచ్చే దిశగా, జగనన్న అందించిన పాశుపతాస్త్రంతో దూసుకువస్తున్న షర్మిల ‘మరో ప్రస్థానమే’... కాంగ్రెస్ పాలిట అంతిమ యాత్ర.

- సిరిపురం గణేష్, శ్రీకాకుళం జిల్లా

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: