జగన్ తో కలయిక యాదృచ్ఛికమే: వంశీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ తో కలయిక యాదృచ్ఛికమే: వంశీ

జగన్ తో కలయిక యాదృచ్ఛికమే: వంశీ

Written By news on Sunday, April 29, 2012 | 4/29/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని తాను నిన్న రోడ్డుపై కలుసుకోవడం యాదృచ్ఛకమేనని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల తాను జగన్ ని కలిశానని చెప్పారు. జగన్ పలకరిస్తే తాను నమస్కారం చేశానన్నారు. ఆయనని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని చెప్పారు. తనకి ఎటువంటి రహస్య ఎజండాలేదన్నారు. ఇతరులతో రాత్రి పూట ఫోన్లలో మాట్లాడే నేతను తాను కాదన్నారు. తన మనసులో ఎటువంటి దురుద్దేశంలేదని స్పష్టం చేశారు. 

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తనకు మంచి మిత్రుడని చెప్పారు. తమ పార్టీలు వేరైనా తాము మిత్రులమన్నారు. పిఆర్ పి నుంచి బయటకు వచ్చిన తరువాత రాధని టిడిపిలోకి తీసుకురావడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే అది సాధ్యంకాలేదన్నారు. నిన్నటి సంఘటన యాదృచ్చికంగానే జరిగిందని వంగవీటి రాధా కూడా ఒక ఛానెల్ లో చెప్పడం తాను చూశానన్నారు. 

తెలుగుదేశం పార్టీ జారీ చేసి నోటీసు తనకి అందలేని చెప్పారు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిసి వివరణ ఇస్తానన్నారు. లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని, ఆ వివరాలన్నీ మీడియాకు కూడా తెలుపుతానని చెప్పారు. ఆ తరువాత తమ నేత చంద్రబాబు నాయుడే విషయాన్ని వివరిస్తారని కూడా చెప్పారు. టిడిపిలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. టిడిపి నుంచి బయటకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానన్నారు. ఆ పార్టీని వదలవసినంత అవసరం కూడా తనకు లేదన్నారు. పార్టీ నుంచి తనని బయటకు 
పంపడానికి ఎవరైనా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించవన్నారు. గన్నవరం నుంచి స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నా పార్టీ కోసం తాను త్యాగం చేశానని చెప్పారు. 

తాను పరిటాల రవి శిష్యుడినని చెప్పారు. ఆయపై అభిమానంతో తన కుమారునికి ఆయన పేరు పెట్టుకున్నానని, ఆ పేరుని కూడా పరిటాల సునీత పెట్టారని చెప్పారు. ఎవరైనా పిల్లల పేర్లతో రాజకీయాలు చేయరని అన్నారు. మంగలి కృష్ణ తనకు తెలియదని, అతనిని తాను ఎప్పుడూ కలవలేదని చెప్పారు.
Share this article :

0 comments: