‘అమ్మా ఏడవద్దు... నేనున్నా ఆదుకుంటా’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘అమ్మా ఏడవద్దు... నేనున్నా ఆదుకుంటా’

‘అమ్మా ఏడవద్దు... నేనున్నా ఆదుకుంటా’

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

సర్వం కోల్పోయిన మల్లమ్మకు పరామర్శ
ఆదుకుంటానని వైఎస్ జగన్ హామీ

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ‘చెప్పులు అమ్ముకుంటూ బతికేవాళ్లం.. అల్లర్లలో నా చెప్పుల డబ్బా కాలిబూడిదైంది. బతుకు దెరువు లేకుండాపోయింది. నన్ను ఆదుకోండి’ అంటూ పట్టణంలోని గంజ్‌మైదాన్ వద్ద పల్లె మల్లమ్మ అనే మహిళ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుల భోరుమంది. ‘అమ్మా ఏడవద్దు... నేనున్నా ఆదుకుంటా’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు భరోసా ఇచ్చి ఓదార్చారు. గంజ్‌మైదాన్‌లోని పోస్టాఫీస్ ప్రహరీ గోడ పక్కన చెప్పులు విక్రయిస్తూ జీవించే మల్లమ్మకు చెందిన డబ్బా ఇటీవలి అల్లర్లలో దహనమైంది.

సర్వం కోల్పోయిన మల్లమ్మ తనను ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారంతో కాలి బూడిదైన డబ్బా వద్దకు చేరుకుంది. జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ గంజ్ మైదాన్ వద్దకు రాగానే మల్లమ్మ ముందుకు వచ్చింది. జగన్ వాహనంలో నుంచి బయటకు రాగానే ఆమె విలపిస్తూ తన గోడు వెల్లబోసుకుంది. ‘అల్లర్లలో చెప్పులడబ్బా పూర్తిగా కాలిపోయింది. ఎనభైవేల రూపాయల నష్టం వాటిల్లింది. ఆదుకోండం టూ’ వేడుకుంది. ‘అమ్మా ఏడవద్దు.. ఆదుకుంటానం టూ’ జగన్ ఆమె కళ్లు తుడిచి భరోసా ఇచ్చారు. పక్కనే ఉన్న పార్టీ నాయకుడు జి.శ్రీధర్‌రెడ్డిని పిలిచి వెంటనే ఆమెకు సహాయం చేయాలని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి సహాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో మల్లమ్మ ముఖంలో సంతోషం కన్పించింది.
Share this article :

0 comments: