కేంద్రం, సీఎం, సీబీఐ కొత్త కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రం, సీఎం, సీబీఐ కొత్త కుట్ర

కేంద్రం, సీఎం, సీబీఐ కొత్త కుట్ర

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

ఒక్కడినే వేధిస్తున్నారన్న అభిప్రాయం జనంలోకి వెళ్లింది
దీన్నుంచి బయటపడేందుకు మంత్రులు, అధికారులను అరెస్టు చేయిద్దాం..బడా పారిశ్రామికవేత్తలనూ జైల్లో వేద్దాం
జగన్ అరెస్టుకు ముందే ఈ వ్యూహం అమలుకు కుట్ర
లేకపోతే ఉప ఫలితాల తర్వాత నిలువలేమని గుబులు
జాబితాలో ఐదుగురు మంత్రులు..
నేడు మోపిదేవిని అరెస్టు చేయనున్న సీబీఐ?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కావాలనే వేధిస్తున్నారన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లిపోయిందని, దీనినుంచి జనం దృష్టిని మళ్లించాలంటే కొందరు మంత్రులు, అధికారులు, బడా పారిశ్రామికవేత్తలు లక్ష్యంగా అరెస్టుల పరంపర కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ స్కెచ్ గీశాయి! దీని అమలుపై సీఎం, సీబీఐ జేడీ ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. సాక్షి గ్రూపు బ్యాంకు ఖాతాల స్తంభన, ప్రకటనలు నిలిపేస్తూ, సాక్షి పత్రిక, టీవీల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు జీవోలు జారీ చేయడం వంటి చర్యలను జగన్‌ను వేధించడంగానే జనం చూస్తున్నారని, ఇది ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మరింత బలం చేకూర్చిందన్న నిర్ధారణకు వచ్చారు. ఈ తరుణంలో ఒక్క జగన్‌ను మాత్రమే అరెస్టు చేస్తే సానుభూతి మరింత పెరుగుతుందని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా ఉప ఎన్నికల్లో డిపాజిట్లను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితిన అధిగమించి జనం దృష్టిని మరల్చాలంటే.. తప్పు చేశారా లేదా అనే దానితో సంబంధం లేకుండా జగన్ కన్నా ముందే కొందరు మంత్రులను, అధికారులను, పారిశ్రామికవేత్తలను వరుసగా అరెస్టులు చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ కేసులో ఐదుగురు మంత్రులను అరెస్టు చేయించాలని సీఎం, సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత గతంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మోపిదేవి వెంకటరమణను ఎంచుకున్నారు. మోపిదేవిని బుధవారం విచారణకు పిలిచిన సీబీఐ గురువారం కూడా విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం, సీబీఐ స్కెచ్‌లో భాగంగానే ‘‘మంత్రులకు, అధికారులకు త్వరలో సీబీఐ పిలుపు.. అరెస్టులు..’’ అంటూ ఆ రెండు పత్రికల్లో వార్తలు వచ్చి ఉంటాయని మంత్రులు, అధికారులు అనుమానిస్తున్నారు. జగన్ అరెస్టు కన్నా ముందుగా ఒకరిద్దరు మంత్రులను అరెస్టు చేసి, తర్వాత జగన్‌ను అరెస్టు చేయాలనేది సీఎం, సీబీఐ పథక రచనగా ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మంత్రులకు ఏమీ చెప్పకుండా గుంభనంగా ఉంటున్న సీఎం... లోలోపల మాత్రం దివంగత వైఎస్ హయాం నాటి మంత్రుల అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్టు ఉన్నతస్థాయి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తప్పు చేశారా లేదా అనేది ఎప్పటికో తేలుతుందని, ఆ లోపల కొందరు మంత్రులను, అధికారులను అరెస్టు చేసి అనంతరం జగన్‌ను అరెస్టు చేయడమే లక్ష్యంగా సీఎం, సీబీఐ పనిచేస్తున్నట్టు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యూహం అమలు చేయకపోతే ఉప ఎన్నికల ఫలితాలు అనంతరం ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నిలబడటం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తప్పొప్పులతో సంబంధం లేకుండా అరెస్టులను వేగవంతం చేయడాని సీబీఐ చర్యలు తీసుకుంటోందని సదరు అధికారి వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: