చేతిలో ఆయుధం పెట్టుకొని గవర్నర్‌ను కోరడమేంటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేతిలో ఆయుధం పెట్టుకొని గవర్నర్‌ను కోరడమేంటి?

చేతిలో ఆయుధం పెట్టుకొని గవర్నర్‌ను కోరడమేంటి?

Written By news on Sunday, February 3, 2013 | 2/03/2013

అవిశ్వాసం పెట్టకపోతే లోపాయికారీ ఒప్పందం ఉన్నట్లే
చేతిలో ఆయుధం పెట్టుకొని గవర్నర్‌ను కోరడమేంటి!

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రభుత్వం మైనారిటీలో ఉందని చెప్పకనే చెప్పినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టేందుకు వెనకడుగు వేయడంలో ఉన్న మతలబేంటని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టేకంటే చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రయోగించవచ్చుకదా? అని నిలదీశారు. అవిశ్వాసం పెట్టకపోతే పాలకపక్షంతో ప్రధానప్రతిపక్షం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లేనని విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై తిట్టని తిట్టు తిట్టకుండా అనునిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదంటారు. అయితే తన చేతిలో ఉన్న ఆయుధం అవిశ్వాసాన్ని మాత్రం ప్రభుత్వంపై ప్రయోగించరట! పిల్లి శాపాలకు ఉట్లు తెగవనే విషయాన్ని బాబు గ్రహించాలి’’ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాల సంఖ్యాబలం తగ్గినప్పుడు, సజావుగా పనిచేయనప్పుడు అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందన్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ అవిశ్వాసం పెట్టుకోవచ్చని ఆయన గుర్తుచేశారు.

ఓపెన్‌గా మద్దతు ప్రకటించు

ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించాలని టీడీపీ ప్రకటించడమంటే అంతకంటే దివాలాకోరుతనం మరొకటి ఉండదని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. మన చేతిలో ఆయుధం పెట్టుకొని పొరుగింటికి వెళ్లడమేమిటని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు డొంకతిరుగుడు మాటలు కాకుండా మైనారిటీలో పడిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తే ఈ సమస్య ఉండదుకదా అని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం 2014 దాకా కొనసాగాలనేదే మీ పార్టీ విధానమైతే స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రజలతో ఉండి పోరాడదలుచుకుంటే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: