జగన్ రాజకీయనాయకుడు మాత్రమే కాదు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రాజకీయనాయకుడు మాత్రమే కాదు...

జగన్ రాజకీయనాయకుడు మాత్రమే కాదు...

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

జగన్‌ని ప్రజలు ఏనాడూ కేవలం ఒక రాజకీయనాయకుడిలా మాత్రమే చూడలేదు. తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆదరించారు. అంతటి ప్రజాభిమానం సంపాదించుకున్నాడు కనుకే కాంగ్రెస్‌పార్టీ ఆయన్ని ప్రజల నుంచి దూరం చేయదలచి లేనిపోని ఆరోపణలు చేసి జైలుకు పంపించింది. అంతటితో ఆగకుండా బెయిల్ రాకుండా ఉండేందుకు సీబీఐని ప్రభావితం చేస్తోంది. ఈ తతంగాన్నంతా రాష్ట్రప్రజలు మొదటినుంచీ గమనిస్తూనే ఉన్నారు. 

ఇటీవల కొంతకాలంగా కాగ్రెస్‌పార్టీ పనిగట్టుకునిమరీ, ఎల్లో మీడియా సహకారంతో వై.ఎస్.ఆర్.సి.పి.లో అంతఃకలహాలు, కుమ్ములాటలు అంటూ దుష్ర్పచారం చేయించడం కూడా ప్రజల దృష్టిని దాటి పోలేదు. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఇంత అమానుషంగా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి కుటుంబాన్ని, వారి పార్టీని నాశనం చేయడానికి పాలకపక్షం, ప్రతిపక్షం చేతులు కలిపాయని ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. తమ నాయకుడైన జగన్‌ని, ఆయన కుటుంబాన్ని, పార్టీని ఎలా రక్షించుకోవాలో వారికి బాగా తెలుసు. త్వరలో రాబోయే ఎన్నికల్లో సోనియాకు, చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పడానికి ఆంధ్రరాష్ట్ర ప్రజలు వేచి ఉన్నారు. జగనే తమ సి.ఎం. అని తీర్పు చెప్పబోతున్నారు. 

- రమేశ్, కాకినాడ

విమర్శించే నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

జగన్ పార్లమెంటు సభ్యుడు. ఒక పార్టీ అధినేత. ఆయనపై ఆర్థిక నేరాలు మోపి జైల్లో పెట్టారు. సోనియాగాంధీ, ప్రధానమంత్రి, సోనియాగాంధీ అల్లుడు, వీరితోపాటు కేంద్రంలోని మరికొందరు పెద్దమనుషులపై కూడా ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. మరి వారిని ఎందుకు జైల్లో పెట్టలేదు? జగన్‌ని జైల్లో పెట్టారు సరే, బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నట్టు? చట్టనిబంధనల మేరకైనా బెయిల్ రావాలి కదా. న్యాయమూర్తులు సైతం నిజాయితీ లేని సీబీఐ వాదనలకు అంతగా ప్రాముఖ్యం ఎందుకు ఇస్తున్నట్లు? ఇదంతా చూస్తుంటే జగన్‌పై జరుగుతున్న కుట్రకు కారణం రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని స్పష్టంగా తెలుస్తోంది. 

వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అభిమానించేవారంతా ఏకతాటి పైకి వచ్చి జగన్‌ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ వారి మనోభావాలను రాష్ట్రపతి గానీ, న్యాయస్థానాలు గానీ పట్టించుకోకపోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యం పైనే నమ్మకం సన్నగిల్లుతోంది. జగన్‌కి వ్యతిరేకంగా ఒక్కో నాయకుడు ఒక్కోమాట విసురుతున్నాడు. ఇది న్యాయమేనా? ఒక్కసారి ఆ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేకుంటే ప్రజలే 2014 ఎన్నికల్లో వారికి ఆత్మదర్శనం చేయిస్తారు.

- జి.సత్యనారాయణ, విశాఖపట్నం
Share this article :

0 comments: