అండగా ఉంటాం: వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అండగా ఉంటాం: వైఎస్సార్‌సీపీ

అండగా ఉంటాం: వైఎస్సార్‌సీపీ

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013


 సిటీలైట్ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ హామీ ఇచ్చారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, విజయారెడ్డిలతో కలసి సోమవారం ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్యసేవలందించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తరచు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. సంబంధిత అధికారులు ఇకనైనా ఉదాసీన వైఖరి విడనాడాలన్నారు. పార్టీ సేవాదళ్ నగర కన్వీనర్ వెల్లాల రాంమోహన్ కూడా గాంధీ ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు.
Share this article :

0 comments: