
నేడు: ఇప్పుడు ఆ అపర సంజీవనికే ఆపదవచ్చింది. వైఎస్సార్ మరణానంతరం సర్కారు 108ను పూర్తిగా గాలికి వదిలేసింది. నిధుల విడుదల తగ్గించేసింది. ఫలితంగా.. చెడిపోయిన వాహనాలు మరమ్మతులు లేక మూలనపడ్డాయి. ఉన్న వాహనాల్లోనూ కొన్ని డీజిల్ లేక నడవడం లేదు. 108లో ప్రధానమైన ఆక్సిజన్ సిలిండర్లను సైతం ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తోందని సిబ్బందే చెబుతున్నారు. పిలిస్తే వెంటనే చేరుకునే ఈ అంబులెన్స్‌లు ఇప్పు డు ఉనికి కాపాడుకునే దుస్థితిలో పడ్డాయనడానికి కరీంనగర్ జిల్లాలోని ఈ రెండు దృష్టాంతాలు చాలు..
- సాక్షి, కరీంనగర్
108 రాలేదు.. ప్రాణం పోయింది

- జంగ సరోజన..రేణికుంట
ప్రభుత్వమే.. నాన్నను హత్య చేసింది..
‘‘మా నాన్నకు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు 108కు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదట. నాకు తెలిసిన వెంటనే నేను వేగంగా అక్కడికి బయ ల్దేరాను. అప్పటికే మా బంధువులు కారులో తీసుకెళ్తుండగా మధ్యలో చనిపోయినట్లు చెప్పారు. 108 టైమ్‌కి వచ్చి ఉంటే నా తండ్రికి ఆక్సిజన్ అందేది. ఆసుపత్రికి త్వరగా వెళితే చికిత్స అందేది. ఆయన బతికేవాడు. కుటుంబ సభ్యులం వెళ్లి మాట్లాడే వాళ్లం. కానీ కనీసం మాటకు కూడా నోచుకోకుండానే దూరమయ్యాడు. 108 వచ్చి ఉంటే ఆయన బతికేవాడని అందరూ అంటుంటే.. ఆ రోజు చాలా బాధనిపించింది. నిజానికి మా నాన్నది ప్రభుత్వం చేసిన హత్యే. అత్యవసర సేవలైన 108, ఆరోగ్యశ్రీలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెఎస్సార్ ఉన్నపుడు వీటికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు.
- జంగ రవీందర్‌రెడ్డి
నాడు.. పది నిమిషాల్లో వచ్చింది..

తర్వాత సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ప్రథమ చికిత్స అందడం, వెంటనే ఆసుపత్రికి రావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. అప్పుడనిపించింది.. 108 అంబులెన్స్ మినీ డిస్పెన్సరీ అని. నా ప్రాణాలు కాపాడిన 108పై నమ్మకం పెరిగింది. 108 సర్వీసులకు అప్పటి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం బాగా నచ్చింది. అందుకే 108కు వాలంటరీగా సేవలందిస్తున్నాను.
నేడు.. ఫోన్ చేస్తే స్పందనే లేదు..
108 సహాయం వల్ల పునర్జన్మ పొందిన నాకు ఇప్పుడు ఆ సర్వీస్‌లపై నమ్మకం పోయింది. రెండేళ్ల క్రితం నేను ఓసారి హైదరాబాద్ వెళ్తుంటే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కనిపించాడు. వెంటనే 108కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన నాథుడు లేడు. విసుగేసింది. అలాగే గోదావరిఖని కూరగాయాల మార్కెట్ దగ్గర ఓ వ్యక్తి గాయాలతో పడిపోయి ఉంటే 108కు ఫోన్ చేశా.. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో నాకు తెలిసిన ఇక్కడి 108 అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి వీలైన సాయం చేశాను. ప్రభుత్వ ప్రోత్సహం లేకపోడంతో 108 సేవలు ఇలా దెబ్బతింటున్నాయి.’’
- దాసారపు మోహన్, గోదావరిఖని
0 comments:
Post a Comment