వైఎస్ జగన్ మీద కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ మీద కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి

వైఎస్ జగన్ మీద కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి

Written By news on Sunday, July 7, 2013 | 7/07/2013

వైఎస్ జగన్ మీద కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి
జగన్ చెబితేనే సంతకం చేశామని చెప్తే మోపిదేవికి బెయిల్ ఇప్పిస్తామని అన్నారట
ఆ మాట కేంద్ర మంత్రే చెప్పడాన్ని బట్టి కుట్ర ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది
ధర్మాన, సబితల విషయంలో కూడా సీబీఐ ధోరణి ఆశ్చర్యం కలిగిస్తోంది
వారిని కూడా బెదిరించి జగన్‌ను మరింత ఇబ్బంది పెట్టాలని చూస్తోంది
రైల్వే కుంభకోణంలో మాజీ మంత్రి బన్సల్‌ను తప్పించేందుకు సీబీఐ యత్నిస్తోంది
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అంతరించిపోయింది.. ఇప్పుడున్నది సీబీఐ కాంగ్రెస్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌ను అణచివేయడానికి, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని మరింత కాలం జైల్లోనే ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర స్థాయిలో చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ‘జగన్ సంతకం పెట్టమంటేనే.. పెట్టాం, ఆయన ప్రమేయంతోనే జీవోలు విడుదల చేశాం’ అని చెబితే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు బెయిల్ ఇప్పించే మార్గాన్ని ఆలోచిస్తామని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పడమంటే కుట్ర ఏ స్థాయిలో జరుగుతుందో తెలుస్తోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా జగన్‌ను అణచివేయడానికి, బడుగువర్గాల నుంచి మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని అంబటి వివరించారు. జగన్‌ను అరెస్టు చేసే ముందు సొంత పార్టీకి చెందిన మంత్రినే అరెస్టు చేశామని చూపించేందుకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐ చేత నాటకమాడించాయన్నారు.

మోపిదేవితో బలవంతంగా సంతకం చేయించారు..
మోపిదేవిని అరెస్టు చేసే ముందు కాంగ్రెస్ నేతలు సృష్టించిన డ్రామాను అంబటి వెల్లడించారు. ‘‘సీఎం క్యాంపు కార్యాలయంలో తయారు చేసిన ఒక లేఖను సీబీఐ కస్టడీలో ఉన్న మోపిదేవి వద్దకు కొంతమంది కాంగ్రెస్ దూతలు తీసుకెళ్లి సంతకం చేయించారు. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి సంతకం చేయమంటే చేశాం తప్పితే తమకు సంబంధంలేదని చెప్పించే ప్రయత్నం చేశారు. మోపిదేవిని గందరగోళానికి గురిచేసి ఒత్తిడిలో సంతకం చేయించారు. 

మంత్రివర్గంలో తీసుకున్న సమష్టి నిర్ణయాలపై కూడా ఇంత అన్యాయంగా, దుర్మార్గంగా ప్రవర్తించారంటే వీరి కుట్రలు ఏస్థాయిలో ఉన్నాయో ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయి’’ అని అంబటి దుయ్యబట్టారు. సీబీఐ ప్రవర్తిస్తున్న విచిత్ర ధోరణి చూస్తే కూడా ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేశాక వారు సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేయడంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. వారు మంత్రులుగా ఉన్నంత కాలం ఈ మాట మాట్లాడని సీబీఐ తర్వాత ఎందుకు ఆ వాదన లేవనెత్తిందని ప్రశ్నించారు. వారిని కూడా తమకు అనుకూలంగా మలచుకొని జగన్‌ను మరింత ఇబ్బందులపాలు చేసేందుకు కాంగ్రెస్ సృష్టించిన కొత్త నాటకమని దుయ్యబట్టారు.

సీబీఐ రూటే సపరేటు!
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏ కేసు నిర్వహించినా వారి తీరు చాలా చిత్రంగా ఉంటుందని అంబటి పేర్కొన్నారు. తాజాగా రైల్వేగేట్ కుంభకోణానికి సంబంధించి వారు ప్రవర్తించిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘‘రైల్వేగేట్ కుంభకోణానికి సంబంధించి ఆ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన పవన్‌కుమార్ బన్సల్‌కు సీబీఐ ముందే క్లీన్‌చీట్ ఇచ్చేసింది. అదే మంటే కేసులో నిందితుడైన బన్సల్ మేనల్లుడు సింగ్లాకు, బన్సల్‌కు మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలూ జరగలేదని చెప్తోంది. అయితే సీఎన్‌ఎన్-ఐబీఎన్ న్యూస్ చానల్ వాస్తవాలేంటో బయటపెట్టింది. డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిన సింగ్లా బేరసారాలన్నీ బన్సల్ ఇంటి నుంచే నిర్వహించినా, అధికార ఫోన్ నుంచే సంభాషణలు జరిపినాకూడా సీబీఐకి కనబడలేదు’’ అని ధ్వజమెత్తారు. కేంద్రం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సీబీఐ ఆడుతుందనేందుకు తాజా సంఘటనే ఉదాహరణ అని అంబటి చెప్పారు. కేంద్ర మాజీ మంత్రులు బన్సల్, అశ్వనీకుమార్, రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల విషయంలో సీబీఐని కేంద్రం కీలుబొమ్మలా ఆడిస్తోందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అంతరించిపోయిందని, ప్రస్తుతమున్నది సీబీఐ కాంగ్రెస్ అని అంబటి ఎద్దేవా చేశారు.

పక్కదారి పట్టించేందుకు ఉత్తి ప్రకటనలు
మహానేత వైఎస్‌ఆర్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం పట్ల ప్రజల్లో జరుగుతున్న విస్తృత చర్చను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజన లీకులు చేస్తోందని అంబటి వ్యాఖ్యానించారు. తెలంగాణ, రాయల తెలంగాణ, సీమాంధ్ర అంటూ పూటకొక లీకులిస్తూ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసి, ప్రజల మధ్య మరింత విద్వేషాలు రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు రాకుండా కాంగ్రెస్, టీడీపీలు ఒకరికొకరు సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారని ఆరోపించారు. అందుకే అంబటి బ్రాహ్మణయ్య మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు జరపడానికి జంకుతున్నారన్నారు. అవనిగడ్డకు ఏడాదికి పైగా సమయమున్నా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాకపోగా చంద్రబాబు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు.
Share this article :

0 comments: