వైఎస్సార్ అన్న ఒక్క పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ అన్న ఒక్క పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసింది

వైఎస్సార్ అన్న ఒక్క పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసింది

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

వైఎస్సార్ అన్న ఒక్క పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసింది: షర్మిల
ఆ పదం రైతులకు అభయహస్తమైంది.. పేదలకు బువ్వ పెట్టింది
ఒక్క పైసా పన్ను పెంచకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరింది
రాష్ట్రంలో వైఎస్సార్ యుగం.. ఓ స్వర్ణయుగం
కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆలోచించి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నింటికీ తూట్లు పెడుతోంది
విశాఖ నుంచి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ అనే ఒక్క పదం ఈ రాష్ట్ర గతినే మార్చేసింది. ఆ ఒక్క పదం ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది. నాయకుడు అంటే ఎలా ఉండాలో చెప్పింది. భావితరాలకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్సార్ అన్న ఆ ఒక్క పదం రైతులకు అభయహస్తం అయింది.. పేద కడుపులకు బుక్కెడు బువ్వ పెట్టింది.. పేదలకు, బీదలకు ఆపన్నహస్తం అయింది.. పేద విద్యార్థుల ఇంట్లో వరం అయింది.. పేద రోగుల ఇంట్లో సంజీవని అయింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లాలో పూర్తయి.. విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలసలో షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..


పైసా చార్జీ పెంచలేదు..
‘‘ఒక్క కొత్త పన్ను వేయకుండానే, ఒక్క పైసా చార్జీలు వేయకుండానే 8 కోట్ల రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరింది వైఎస్సార్ అన్న పదం. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తెలుగువాడి గౌరవం పెంచిన పదం వైఎస్సార్. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి దేశానికే వైఎస్సార్ మార్గదర్శకంగా నిలిచారు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో వైఎస్సార్ యుగం అన్నది ఒక స్వర్ణయుగంలా నిలిచిపోయింది. వైఎస్సార్.. డాక్టర్ చదువు పూర్తి చేసుకొని సొంత ఊరికి వచ్చే సరికి మా తాత రాజారెడ్డి ఆయన కోసం ఒక ఆసుపత్రి కట్టి ఉంచారు. వైఎస్ 1973 నుంచి డాక్టర్‌గా ప్రజలకు ఉచితంగా సేవ చేశారు. రాజకీయంగా ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయవచ్చనే ఆలోచనతో 1978లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 10 సార్లు తిరుగులేని నాయకుడిగా ఎన్నికయ్యారు. 2004, 2009లలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక అనుకున్నది నేరవేర్చుకున్నాను, ఇక చాలులే అని ఎప్పుడు కూడా వైఎస్సార్ అనుకోలేదు. నమ్మిన ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని పదేపదే గుర్తుచేసుకునేవారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి ప్రతి తెలుగువాడు సంతోషంగా ఉండాలని వైఎస్సార్ తపించారు. ఆ తపనలోంచి పుట్టినవే ఈ అద్భుత సంక్షేమ పథకాలు. ఆ పథకాల వల్ల మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందారు. వైఎస్సార్ 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడి, ఆయన మరణించిన తరువాత అదే వైఎస్సార్ పేరును ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. వైఎస్సార్ ఆశయాలను, సిద్ధాంతాలను ఖూనీ చేసి ఆయన ప్రతి పథకానికీ తూట్లు పెట్టింది.

ఇది చంద్రబాబు పాలన రెండో భాగం..
టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తోందీ ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడి పాలన రెండో భాగం. చంద్రబాబు హయాంలో మాదిరిగానే రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు విప్ జారీ చేసి మరీ ఈ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు.’’

7.1 కిలోమీటర్ల యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 203వ రోజు సోమవారం విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలోని సరిపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర చేస్తూ షర్మిల విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గంలోని చింతలపాలెం, దేశపాత్రునిపాలెం, మంగళపాలెం మీదుగా కొత్త వలస మండల కేంద్రం చేరుకున్నారు. ఇక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. ఇదే మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారు. సోమవారం మొత్తం 7.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,702.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరావు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కుంబా రవిబాబు, చెంగల వెంకట్రావ్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, స్థానిక నాయకులు భూపతి రాజు శ్రీనివాసరాజు, రెండు జిల్లాలకు చెందిన వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

షర్మిల దంపతుల రక్తదానం
వైఎస్సార్ 64వ జయంతి సందర్భంగా షర్మిల సోమవారం విశాఖపట్నం జిల్లా సరిపల్లిలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా వైఎస్సార్ విగ్రహం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం 60మంది అంధ విద్యార్థులకు దుప్పట్లు, దుస్తులను పంచిపెట్టారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో షర్మిల, భర్త అనిల్ కుమార్ రక్తదానం చేశారు. పాదయాత్రలో ఆమె రక్తదానం చేయడం ఇది రెండోసారి. మొదటిసారి 1000 కిలో మీటర్లు పూర్తి అయిన సందర్భంగా నల్లగొండ జిల్లా కొండప్రోలుగట్టు గ్రామం వద్ద నిర్వహించిన శిబిరంలో రక్తమిచ్చారు. సరిపల్లిలో రక్త దానం అనంతరం యాత్ర ప్రారంభించిన షర్మిల ఏక బిగిన 6.5 కిలోమీటర్లు నడిచారు. షర్మిల చిన్నమ్మ స్వర్ణమ్మ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, డాక్టర్ హరికృష్ణ, పీలా ఉమారాణితో పాటు మొత్తం 64 మంది రక్తదానం చేశారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
సోమవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 203: కిలోమీటర్లు: 2,702.7
Share this article :

0 comments: