జగన్ కోసం- 281 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం- 281 రోజులు

జగన్ కోసం- 281 రోజులు

Written By news on Sunday, March 3, 2013 | 3/03/2013


మీరు మాట ఇచ్చి నిలబడ్డారు
మేము ఓటు ఇచ్చి నిలబెడతాం


వై.ఎస్.జగన్ కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక చెల్లెలు రాస్తున్న ఉత్తరం ఇది. అన్నయ్యా,
నాకు రాజకీయ పార్టీల గురించి ఏమంత తెలీదు. కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ రాజకీయ నాయకులు బాధపెట్టే విధానం చూస్తుంటే, భారతిగారు పిల్లల గురించి చెబుతుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. అంతా ధైర్యంగా ఉండండి. మీ నాన్నగారు వైఎస్సార్ చేసిన మేలు మీకు కలిసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరి గుండెలోనూ రాజశేఖరరెడ్డి ఉన్నారు. మీరు జైల్లో ఉన్నందుకు మేమంతా అనుక్షణం బాధపడుతూనే ఉన్నాం. భగవంతుడు మీకు ఆనందాన్ని కలిగించే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం.

భారతదేశానికి ఆరోగ్యవంతులు, ధైర్యవంతులు, తెలివిగల యువకులు ఉంటే దేశాన్ని అభివృద్ధి పథంలో నడపగలుగుతాం అని స్వామి వివేకానంద చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి మీలాంటి ధైర్యవంతులు కావాలి. వివేకానంద కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి మీరు అని నా అభిప్రాయం. మీరు ధైర్యంగా ఉన్నారు కాబట్టే ఇన్ని కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే యువశక్తి మీరు మాత్రమేనని ప్రతి ఒక్కరికీ తెలుసు. కేవలం మాకు (ప్రజలకు) ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న కారణంగా ఈ రోజున మీరు పడుతున్న ఇబ్బందులన్నింటినీ త్వరలోనే మా ద్వారా ఉపశమనం లభించి తీరుతుంది. ఇది మేము మీకిస్తున్న హామీ.

- డి.పద్మావతి, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు

ఓర్వలేనివారు కక్ష కట్టారు
ఓదార్పు పొందినవారు రక్షగా ఉన్నారు

నేను, నా కుటుంబం వై.ఎస్. అభిమానులం. కారణం ఆయన వ్యక్తిత్వం, మంచితనం, పేదల పట్ల ఆయనకున్న దయ, కనికరం. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు వై.ఎస్. చేసిన కృషిని చూసి అభిమానం ఒక్కటే కాదు, గౌరవం, ప్రేమ కూడా పెంచుకున్నాం. రాష్ట్రంలో ఆయన సహాయం పొందని గడపంటూ ఉండదని నా అభిప్రాయం. ఆ మహానేత మరణం మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. ఆయన కోసం ఎన్నో రోజులు దుఃఖించాం. మాలాగే వై.ఎస్.గారి మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రాష్ట్ర ప్రజలను ఆయన తనయుడు జగన్ ఓదార్చుతుంటే, వారి హృదయాల్లోకి ఆయన జగన్ రూపంలోకి వచ్చినట్లనిపించింది. రాజన్న కొడుకు మాకు అండగా నిలుస్తాడు అని అంతా సంతోషిస్తున్న సమయంలో ఆ ప్రజాదరణను చూసి ఓర్వలేనితనంతో, రాజకీయ దురుద్దేశంతో, విచారణ అనే నెపంతో ఆయన్ని జైలుపాలు చేశారు.

అన్ని రాజకీయ పార్టీలు ఏకమై, ఒక్కడిని చేసి జగన్‌ని రాజకీయంగా దెబ్బతీయాలని కక్ష కట్టారు. కాని దేవుడు మంచివాళ్ల పక్షాన నిలుస్తాడని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటాడని ఉపఎన్నికలు నిరూపించాయి. జగన్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది. దేవుడు గొప్పవాడు. నమ్ముకున్నవాళ్లకు అన్యాయం చేయడు. తొందరలోనే జగన్ నిర్దోషిగా విడుదలవుతారు. రాష్ట్ర ప్రజలకు నాయకుడవుతారు. జైల్లో జగన్‌కి ఎటువంటి ఆపదా కలగకూడదని, ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వాలని, తొందరలో ఆయన బయటకు రావాలని ప్రతిదినం దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మలకు దేవుడు కొండంత ధైర్యాన్నివ్వాలని కోరుతున్నాను. దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి, తొందరలో ఆ కుటుంబం కష్టాల్ని తీర్చి వారికి సంతోషం, శాంతిని కలగజేయాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు బైబిలులోని కొన్నివాక్యాలు గుర్తుకు వస్తున్నాయి.
‘అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక
నేనతని తప్పించెదను
అతడు నా నామము నెరిగినవాడు గనుక
నేనతని ఘనపరచెదను
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను
శ్రమలో నేనతనికి తోడై యుండెదను
అతని విడిపించి అతని గొప్ప చేసెదను
దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచెదను
నా రక్షణ అతనికి చూపించెదను’ (కీర్తనలు 91:14-16)
దేవుడు ఈ వాగ్దానమును జగన్ పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల నెరవేర్చును గాక
- డా॥విజయలక్ష్మి, ఆదర్శనగర్, దైవ సేవకురాలు, హైదరాబాద్
Share this article :

0 comments: