రైతాంగంపై రూ. 40 కోట్ల భారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతాంగంపై రూ. 40 కోట్ల భారం

రైతాంగంపై రూ. 40 కోట్ల భారం

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సబ్సిడీ విత్తనాల ధర వల్ల రైతాంగంపై రూ. 40 కోట్ల మేర భారం పడిందని, ఈ పెంచిన ధరను వెంటనే తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. అకాల వర్షాలు, గిట్టుబాటు ధరలు లభించక, విద్యుత్ చార్జీలతో సతమతం అవుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై మరింత భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభాపక్షం ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి తెల్లం బాలరాజు, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. 

గత ఏడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు విత్తనాల ధరలు 17 శాతం పెరిగాయని, దీని వల్ల ఒక క్వింటాలుకు రూ. 150 నుంచి రూ. 500 మేరకు ధర పెరిగిందని వారు వివరించారు. ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడానికే విత్తనాల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. దీని కోసం అధికారంలో ఉన్న నాయకులకు, కంపెనీ యాజమాన్యాల మధ్య కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన విత్తనాల ధరలు పెంచారో ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గత ఖరీఫ్‌లో అమ్మిన ధరలకే విత్తనాలు రైతులకు సరఫరా చేయాలన్నారు. విత్తనాల భారాన్ని తగ్గించకపోతే రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు.
Share this article :

0 comments: