సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడనక్కర్లేదు: సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడనక్కర్లేదు: సీబీఐ

సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడనక్కర్లేదు: సీబీఐ

Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013

 చివరగా ఏ చార్జిషీటు వేస్తే అదే తుది చార్జిషీటని వెల్లడి
- జగన్, సాయిరెడ్డి మెమోలపై ప్రత్యేక కోర్టులో కౌంటర్
- ఒకే చార్జిషీటు వేస్తామని సుప్రీంకు చెప్పాం: సీబీఐ లాయర్
- కోర్టులు కూడా తమను నియంత్రించలేవంటూ తీవ్ర వ్యాఖ్యలు
- సుప్రీంను లెక్కచేయని రీతిపై సుశీల్‌కుమార్ అభ్యంతరం
- దాంతో కౌంటర్లో పొరపాటున అలా పేర్కొన్నామన్న సీబీఐ 
- ఉపసంహరించుకుంటామని విజ్ఞప్తి.. సుశీల్ తీవ్ర అభ్యంతరం
- కౌంటర్ ఉపసంహరణకు అనుమతించని ప్రత్యేక న్యాయస్థానం

 ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసులో మిగతా అంశాలపై దర్యాప్తు పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు వేస్తామంటూ సుప్రీంకోర్టుకు మేం హామీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ హామీకి మేం కట్టుబడి ఉండాల్సిన అవసరం మాత్రం లేదు’’ అని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలియజేసింది. సీఆర్పీసీ సెక్షన్ 173(8) ప్రకారం చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా దర్యాప్తును కొనసాగించి, మరిన్ని నివేదికలు సమర్పించే అధికారం తమకు ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకునేలా సీబీఐని ఆదేశించాలంటూ జగన్, ఒకే తుది చార్జిషీటు వేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చాక ఏప్రిల్ 8న ఒక చార్జిషీటు దాఖలు చేసింది గనుక దాన్నే తుది చార్జిషీటుగా పరిగణించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి వేర్వేరుగా మెమోలు దాఖలు చేయడం తెలిసిందే. వాటిపై బుధవారం సీబీఐ కౌంటర్ వేసింది. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ భాన్ వాదనలు ఆరంభిస్తూ, తనకు మరింత సమయం కావాలని కోరారు. మే 21 వరకూ తనకు వీలు కాదని కూడా చెప్పారు. 

పిటిషనర్లు జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ అందుకు అభ్యంతరం చెప్పారు. దాంతో అశోక్ భాన్ సుప్రీంకోర్టు తీర్పును చదువుతూ వాదనలు మొ దలుపెట్టారు. దర్యాప్తు పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు వేయాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ఎక్కడా చెప్పలేదన్నారు. సీబీఐ తాజాగా దాఖలు చేసిన నాలుగు పేజీల కౌంటర్‌ను కూడా ఆయన చదివి వినిపించారు. ‘‘కేసుకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆరు అంశాలకు గాను పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, కోల్‌కతా కంపెనీలకు సంబంధించిన అంశాల్లో దర్యాప్తు పూర్తయిం ది. సంబంధిత చార్జిషీట్లు వివిధ దశల్లో ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి. పరిశీలన పూర్తవగానే ఆ మూడు చార్జిషీట్లనూ దాఖలు చేస్తాం.

ఇంకా మిగిలిన సండూర్ పవర్, భారతీ సిమెంట్స్‌కు మైనింగ్ లీజుల కేటాయింపు, ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఇచ్చిన లేపాక్షి నాలెడ్జి హబ్ అంశాల్లో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని తెలిపారు. అయితే ఒకే తుది చార్జిషీటు వేస్తామంటూ సుప్రీంకోర్టు ఎదుట తాము అంగీకరించిన అంశానికి పెద్దగా విలువ లేదనే రీతిలో సీబీఐ పేర్కొనడంపై సుశీల్‌కుమార్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. కౌంటర్లో సీబీఐ వాడిన భాష కూడా... సుప్రీంకోర్టు తీర్పుకు పెద్దగా విలువ లేదనే రీతిలో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో వెంటనే తేరుకున్న అశోక్ భాన్, కౌంటర్‌లో తాము పొరపాటున అలా పేర్కొన్నామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కౌంటర్‌లో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

మేం చెప్పాం గానీ.. తీర్పులో లేదు
జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి ఒకే తుది చార్జిషీట్ వేయాలని సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా పేర్కొనలేదన్న అశోక్ భాన్... ఆ మేరకు కోర్టుకు తాము లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీకి మాత్రం విలువ లేదన్నట్టుగా మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఏడంశాల్లో దర్యాప్తు పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు వేస్తామని సుప్రీంకోర్టుకు తమ న్యాయవాది మోహన్ పరాశరన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూనే.. కోర్టు మాత్రం తుది చార్జిషీటు వేశాకే పిటిషనర్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించవచ్చని ఉత్తర్వుల్లో చెప్పిందని గుర్తు చేశారు. 

‘‘ఈ ఏడంశాల్లో ఒకటైన దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై ఇప్పటికే చార్జిషీటు వేశాం. మిగతా అంశాలపై కూడా వేస్తాం. చిట్టచివరి చార్జిషీటు కూడా దాఖలు చేశాకే పిటిషనర్ బెయిలు కోసం దరఖాస్తు చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది’’ అన్నారు. ‘‘మా హామీని సుప్రీం తన ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు తీర్పును మేం ఉల్లంఘించలేదు. ఆ తీర్పుపై ఏమైనా సందేహాలుం టే సుప్రీంకోర్టులోనే నివృత్తి చేసుకోవాలి. సీబీఐ కోర్టు దానిపై ఏమీ చెప్పజాలదు’’ అన్నారు! జగన్, సాయిరెడ్డి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని మే 27కు వాయిదా వేసింది.

సుప్రీం విషయంలోనూ ధిక్కార స్వరం!
పెండింగ్‌లో ఉన్న ఏడు అంశాలపైనా దర్యాప్తు పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు వేస్తామని లిఖిత పూర్వకంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన సీబీఐ... ఆ మేరకు పిటిషనర్ చేస్తున్న వాదన సరికాదని తాజా కౌంటర్లో పేర్కొనటం గమనార్హం. నిజానికి సీబీఐ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు తన తీర్పులో సైతం ప్రస్తావించింది. పెపైచ్చు దర్యాప్తు జరపకుండా కోర్టులేవీ తమను నియంత్రించజాలవని కూడా కోర్టు ధిక్కార స్వరం వినిపించే రీతిలో సీబీఐ తాజా కౌంటర్లో పేర్కొంది. ‘‘సీఆర్పీసీలోని సెక్షన్ 173(8) ప్రకారం దర్యాప్తు చేస్తున్న అధికారికి చార్జిషీటు వేశాక కూడా తదుపరి నివేదిక దాఖలు చేసే అధికారం ఉంటుంది. 

మా మెడకు గొలుసులు వేసి మమ్మల్ని అడ్డుకునే అవకాశాన్ని ఈ సెక్షన్ నిషేధిస్తోంది. చట్టప్రకారం మేం నిర్వర్తించాల్సిన బాధ్యతను పలచన చేయటం గానీ, తగ్గించటం గానీ విచారణ కోర్టులు చేయజాలవు. సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని ఒకే తుది చార్జిషీటు దాఖలు చేయాలని గానీ, మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేయవద్దని కానీ చెప్పలేదు’’ అని కౌంటర్‌ను ప్రస్తావిస్తూ అశోక్‌భాన్ వాదించారు. దీనిపై సుశీల్‌కుమార్ అభ్యంతరం చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు విలువ లేదనే రీతిలో సీబీఐ చెబుతోందని, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అంతలో తేరుకున్న అశోక్ భాన్.. తమ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

వెనక్కి తీసుకుంటాం... అనుమతించండి
సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే రీతిలో భాషను వాడటం.. సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఇచ్చిన హామీకి కూడా తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న రీతిలో వ్యాఖ్యలు చేయటం వంటివి కౌంటర్లో చోటు చేసుకోవటంతో... దాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ కోర్టును అభ్యర్థించారు. కోర్టు అనుమతిస్తే మరో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కానీ కౌంటర్ దాఖలు చేసి, ఇరుపక్షాలూ దానిపై వాదనలు కూడా పూర్తి చేసిన తరవాత కౌంటర్‌ను ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతించలేదు.

అప్పుడలా.. ఇప్పుడిలా...
‘‘రాజ్యాంగంలోని 141వ అధికరణం ప్రకారం కింది కోర్టులతో సహా ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందే’’ అని వైఎస్ జగన్ గతంలో బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు సీబీఐ తరఫున అశోక్ భానే గట్టిగా వాదించారు! దర్యాప్తు పూర్తయ్యాక మాత్రమే బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం చెప్పింది గనుక.. దర్యాప్తు ఇంకా పూర్తవలేదు గనుక బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని అప్పట్లో కోరారు. కానీ ఇప్పుడేమో తమను సుప్రీం తీర్పు కూడా నియంత్రించజాలదనే రీతిలో పేర్కొనటంపై న్యాయవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.

జేడీ హాజరు... సుశీల్‌తో వాగ్వాదం
జగన్ కేసుపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను మొదటి నుంచీ పలు సందర్భాల్లో తన చర్యల ద్వారా వ్యక్తపరుస్తూనే వస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం కూడా విచారణకు హాజరై చివరిదాకా ఉండటం గమనార్హం. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కు సమీపంలోనే ఆయన కూర్చున్నారు. సుశీల్ చేసిన కొన్ని వాదనలపై ఇరువురి మధ్యా స్వల్పంగా వాడివేడి వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
Share this article :

0 comments: