సీబీఐ నిజస్వరూపం రుజువైంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ నిజస్వరూపం రుజువైంది

సీబీఐ నిజస్వరూపం రుజువైంది

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

- సుప్రీంకోర్టుకు సీబీఐ డెరైక్టర్ నివేదికే తార్కాణం: కొణతాల
- సుప్రీం పర్యవేక్షణలోని కేసు పరిస్థితే ఇలా ఉంటే ఇతర కేసుల మాటేమిటి?
- కాంగ్రెస్ తొత్తుగా పనిచేస్తున్న దర్యాప్తు సంస్థ
- జగన్ కేసులో సీబీఐ చార్జిషీట్లన్నీ కేంద్రం నుంచి వచ్చినవే
- రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్న కాంగ్రెస్

సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్న వాస్తవం సుప్రీంకోర్టులో తాజాగా ఆ సంస్థ డెరైక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్‌తో మరోసారి రుజువైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికను రహస్యంగా ఉంచాల్సిన సీబీఐ, దాన్ని కేంద్ర మంత్రుల ముందు పెట్టడం చూస్తే వారి విశ్వసనీయత ఏంటో బట్టబయలైంది. సీబీఐ కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులను వేధించే ఆయుధంగా పనిచేస్తోంది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. 

శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రహస్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్ర న్యాయ మంత్రి అశ్వినికుమార్‌కు, ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖల సంయుక్త కార్యదర్శులకు చూపించామంటూ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న కేసులోనే ఇలా మంత్రులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రైవేట్ కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?’’ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటకొచ్చినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కావాలనే కుట్రపూరితంగా కేసులు బనాయించారన్నారు. కోర్టు ప్రమేయం లేకుండా నడుస్తున్న జగన్ కేసులో సీబీఐ వేసే ప్రతి చార్జిషీటూ కేంద్రం ఆదేశాల మేరకే సిద్ధమవుతోందని తెలిపారు. కాంగ్రెస్ తన కక్షసాధింపు చర్యల కోసం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగ పరుస్తోందన్నారు.

కాంగ్రెస్, టీడీపీలకే నచ్చుతోంది: సీబీఐ వ్యవహరిస్తోన్న తీరు కాంగ్రెస్, టీడీపీలకు మాత్రమే నచ్చుతోందంటూ కొణతాల ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని పార్టీలూ సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరుతుంటే, ఆ రెండు పార్టీలు మాత్రం ఆ సంస్థ తమకు అనుకూలంగా పనిచేసేలా, తమ తొత్తులా ఉండేందుకే ఇష్టపడుతున్నాయని మండిపడ్డారు. ప్రత్యర్థులు ఎవరుంటే వారిపై దాడులు చేయడానికి సీబీఐ కాచుకుని కూర్చుంటుందంటూ ధ్వజమెత్తారు. 

అందులో భాగంగానే జగన్‌పై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించారని చెప్పారు. ‘‘2జీ స్పెక్ట్రం కేటాయింపులు ప్రధానికి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలిసే జరిగాయంటూ టెలికం మాజీ మంత్రి ఎ.రాజా అఫిడవిట్ దాఖలు చేసినా పట్టించుకోకుండా అంతా ఆయనపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరణించిన రాజశేఖరరెడ్డి పేరును ముద్దాయిగా ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది.

కానీ జీవోలు విడుదల చేసిన మంత్రులు, సంబంధిత శాఖల అధికారులను మాత్రం విస్మరించారు. ఎఫ్‌ఐఆర్‌లో 50వ నిందితునిగా ఉన్న జగన్‌ను చార్జిషీట్లకు వచ్చేసరికి తొలి నిందితుడిగా చేర్చారు. వారికిష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు. తుది చార్జిషీట్ నమోదు చేయాలన్న ఆదేశాలనూ పెడచెవిన పెట్టారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఏదోలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలయ్యే దాకా జగన్ బయటకు రాకుండా అడ్డుకునేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారు. వీరి చర్యలను చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటోంది’’ అన్నారు. 

సీఎస్‌ల నియామకంలోనూ చంద్రబాబు బాటే..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకంలో పారదర్శకత లోపించిందని కొణతాల అభిప్రాయపడ్డారు. ‘‘ఢిల్లీలో పని చేస్తున్న 1977 బ్యాచ్ అధికారి జె.సత్యనారాయణ ఉన్నా ఆయన్ను పక్కకు పెట్టి, 1979 బ్యాచ్‌కు చెందిన పీకే మహంతిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే పని చేస్తున్న వారిని తీసుకోవాలనుకుంటే 1978 బ్యాచ్‌కు చెందిన శామ్యూల్ ఉన్నారు. కానీ పట్టించుకోలేదు. దళిత బాంధవుడని బిరుదు అందుకున్న సీఎం కిరణ్ వారికి మొండిచేయి చూపారు. 1979 బ్యాచ్ వారినే తీసుకోవాలనుకుంటే రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తున్న ఐవీఆర్ కృష్ణారావు ఉన్నా పక్కకు పెట్టాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా తన హయాంలో ఇదే విధానం అవలంభించారు. కిరణ్ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు’’ అని మండిపడ్డారు.
Share this article :

0 comments: