చిరునవ్వే జగన్ ఆయుధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరునవ్వే జగన్ ఆయుధం

చిరునవ్వే జగన్ ఆయుధం

Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో అంతా కాంగ్రెస్‌పార్టీ అభిమానులే. వాళ్లు ఎప్పుడు ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకే. నేను కూడా నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌కు తప్ప ఏ ఇతరపార్టీకీ ఓటు వెయ్యలేదు. డాక్టర్ రాజశేఖరరెడ్డిగారు సీ.ఎం అయిన తర్వాతైతే కాంగ్రెస్‌పార్టీ విలువ మరింత పెరిగింది. కాంగ్రెస్‌పార్టీ అంటే మాకిప్పుడు వైయస్సార్‌గారి కుటుంబమే. ఆ మహనీయుడు చనిపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఆయన లేని కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడు మాకు భయంకరంగా కనిపిస్తోంది రాష్ట్రం ఏమైపోతుందోనన్న భయం కలుగుతోంది. 

నాకు మాత్రమే కాదు, మావాళ్లు, బంధువులు, పరిచయస్థులు అందరికీ అలానే అనిపిస్తోంది. ఇప్పటికీ రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో పాటే మనం పోయాం... అనుకుని జీవితాన్ని గడుపుతున్న వాళ్లు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు. ఇప్పటికి, ఎప్పటికి అందరిలోనూ ఒక్కటే బాధ. ఇందిరా గాంధీగారు పోయినప్పుడు రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిని చేశారు. ఆవిడ చనిపోయిన బాధ చాలావరకు తగ్గి, ప్రజలు కొంతైనా ఉపశమనం పొందారు. మరి మనదగ్గర ఎందుకండీ అందుకు భిన్నంగా ఉంది!! ప్రజలందరూ కోరుకునే విధంగా, వాళ్ల అభీష్టాన్ని గౌరవించి జగన్‌మోహన్‌రెడ్డిగారిని ఎందుకు సీఎం చెయ్యలేదు? మనది ప్రజాస్వామ్యం. 

ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొనే ప్రభుత్వం. మరి ఇప్పుడున్న కిరణ్ ప్రభుత్వానికి మనం ఓటు వెయ్యలేదు. ఆ సీట్లో ఆయనెలా ఉంటారు? ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వం ప్రజలను పాలించడం అప్రజాస్వామికం కాదా. ప్రజలకు నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప పార్టీకి నచ్చిన వ్యక్తి కాదు. ఇప్పుడున్న ప్రభుత్వానికీ ప్రజలకు సంబంధం లేదు. అందుకే ప్రజాదరణ, ప్రజాభిమానం ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిగారు సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మాకు వైయస్సార్ కాంగ్రెస్ మాత్రమే. 

- వై. లక్ష్మీసుధ, అడ్వొకేట్, అంతర్వేదిపాలెం, తూ.గో.జిల్లా

చిరునవ్వే జగన్ ఆయుధం

నేను రాజన్న దయతో చదివిన ఒక ఎం.సి.ఏ హోల్డర్‌ని. నేను పరిశీలించిన అంశాలు కొన్నింటిని మీ దృష్టికి తెస్తున్నాను.

బాబు భాగోతం: అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రజలను విస్మరించినదే కాకుండా, తన కలలో కూడా ఊహించని రాజన్న పథకాలను ‘నా పథకాలే’ అని నిస్సిగ్గుగా చెప్తున్నారు చంద్రబాబు. ఆయన ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలకు తిరిగి చేరువ కాలేరు.

కిరణ్ ‘కీడు’ కాలం: రాష్ర్టం ఇప్పుడు అనాథ అయింది. రాజన్న చనిపోయాక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 108 కి జబ్బు చేసింది. ఫీజుల రీయింబర్స్‌మెంట్ అటకెక్కింది. రేట్లు, పవర్‌కట్‌లు పెరిగాయి. రాజన్న పథకాలన్నిటినీ రద్దు చేసేందుకు కిరణ్ సర్కార్ కృషి చేస్తోంది. 

జనం కోసం జగన్: ఎంతో ధైర్యంతో, ఓర్పుతో, చిరునవ్వుతో ప్రజల అప్యాయతతో న్యాయదేవతను నమ్మి సోనియాను ఎదిరించిన ధైర్యశాలి జగన్. ఈ పరిస్థితి వేరే ఎవరికైనా వచ్చివుంటే ఏనాడో సోనియా కాళ్లపై పడి ఉండేవారు. కాని జగన్ అలాంటి వ్యక్తి కాదు. త్వరలోనే జగన్ బయటికి వస్తారని, తన తండ్రిలా ప్రజలను పాలిస్తారని ఆశిస్తున్నాం.

- కె. చెన్నమల్లప్ప, ఇంజినీర్, సూగేపల్లి, అనంతపురం జిల్లా

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: