వచ్చే సువర్ణయుగంలో నిర్మించి ఇస్తా.. నేనే ప్రారంభోత్సవం చేస్తా: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చే సువర్ణయుగంలో నిర్మించి ఇస్తా.. నేనే ప్రారంభోత్సవం చేస్తా: వైఎస్ జగన్

వచ్చే సువర్ణయుగంలో నిర్మించి ఇస్తా.. నేనే ప్రారంభోత్సవం చేస్తా: వైఎస్ జగన్

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

విజయవాడలో పేదల స్వాధీనంలో ఉన్న స్థలాలను 
వైఎస్ గజం రూ.100కే రిజిస్ట్రేషన్ చేశారు
ఇప్పుడు ఆ స్థలం గజం రూ.40 వేలు పలుకుతోంది
వచ్చే సువర్ణయుగంలో గజం రూ.50కే పేదలకు అందిస్తా
జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
వైఎస్‌కు, వంగవీటి రంగాకు మధ్య ఉన్న అన్నదమ్ముల
స్నేహమే ఇప్పుడు పునరావృతమైందన్న జగన్
తన తండ్రి అభిమానులంతా జగన్ వెంట ఉంటారని 
వంగవీటి రాధా ఉద్ఘాటన
రాధా చేరిక సభకు భారీ ఎత్తున తరలివచ్చిన జనం

విజయవాడ, న్యూస్‌లైన్: త్వరలోనే సువర్ణయుగం వస్తుందని, వచ్చిన రెండేళ్లలోనే బందర్ పోర్టును పూర్తి చేస్తామని, దాన్ని తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం విజయవాడ మాజీ శాసన సభ్యుడు వంగవీటి రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడ రాఘవయ్యపార్కు వద్ద ఏర్పాటు చేసిన సభకు భారీ ఎత్తున హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. బందర్ పోర్టు సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బంద్‌లో తమ పార్టీ అగ్రభాగాన ఉండి పోరాడిందన్నారు. ఈ ప్రభుత్వం నిర్మించినా నిర్మించకున్నా.. వచ్చే సువర్ణయుగంలో బందరు పోర్టు కల సాకారమవుతుం దన్నారు. 

విజయవాడ నగరంలో పేదల స్వాధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గజం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్ చేశారని, ఇప్పుడు ఆ స్థలం గ జం రూ.40 వేలు పలుకుతోందని, పేదలంతా వైఎస్‌ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని వంగవీటి రాధా చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుచేస్తూ.. వచ్చే సువర్ణయుగంలో పేదలకు గజం రూ.50కే అందిస్తానని హామీ ఇచ్చారు.

రాధాను లక్ష్మణుడిలా గుండెల్లో పెట్టుకుంటా: ‘రాధాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకే కాదు, నా తమ్ముడిలా నా గుండెల్లోకి చేర్చుకుంటున్నాను. రాముడికి లక్ష్మణుడి మాదిరిగా రాధాను నా గుండెల్లో పెట్టుకుంటాను. దివంగత నేత వైఎస్‌కు, వంగవీటి రంగాకు మధ్య ఉన్న అన్నదమ్ముల స్నేహమే ఇన్ని సంవత్సరాల తర్వాత పునరావృతమవుతోంది’ అని జగన్ జనం హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ వెంటే నడుస్తానని రాధా చెప్పారు.

18 సీట్లలో గెలుస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా: రాధా

వచ్చే ఉప ఎన్నికల్లో 18 సీట్లలో గెలిచే దమ్ము, ధైర్యం మీకుందా అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను వంగవీటి రాధాకృష్ణ నిలదీశారు. చంద్రబాబు, బొత్స రెండో, మూడో సీట్లు వస్తాయంటూ, బరిలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నారని, వారితో తమకు పోటీ ఏంటని ప్రశ్నించారు. 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అండదండలతోనే తన తండ్రి వంగవీటి మోహనరంగాకు సీటు వచ్చిందని, 2004లో అదే వైఎస్ నాయకత్వం కింద పనిచేసే అదృష్టం తనకు వచ్చిందని రాధా చెప్పారు. మళ్లీ 2012లో జగన్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలను నీరుగారుస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదని, ఆరోగ్యశ్రీలో పలు రోగాలను తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయంగా దిక్కు దివాణం లేకపోవడంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, వారు ఎయిర్‌లైన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా పనికి వస్తారన్నారు. 

కష్టంలో ఉండేవాడికి కులం, మతం ఉండదని, అదే స్ఫూర్తితో పేదలను వైఎస్ ఆదుకున్నారన్నారు. తన తండ్రి అభిమానులంతా జగన్ వెంట నడుస్తారన్నారు. తన తండ్రి రంగా మరణించి ఇన్నేళ్లు గడచినా వంగవీటి కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారని, వారు తమ పట్ల చూపించే ఆదరాభిమానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉంటాయని ప్రకటించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామమోహనరావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో జనసునామి వచ్చినట్లుందన్నారు. సూర్యచంద్రులతో సహజీవనం చేస్తూ ప్రతిక్షణం ప్రజల మధ్య గడుపుతున్న జగన్ త్వరలో సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
Share this article :

0 comments: