కొత్తమలుపు తిరగనున్న బెజవాడ రాజకీయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొత్తమలుపు తిరగనున్న బెజవాడ రాజకీయం

కొత్తమలుపు తిరగనున్న బెజవాడ రాజకీయం

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

విజయవాడ: బెజవాడ రాజకీయాలు కొత్త మలపు తిరగనున్నాయి. సంచనాలకు కొదవలేని బెజవాడ మరో రాజకీయ సంచలనానికి వేదిక కానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమక్షంలో వంగవీటి రాధా చేరిక కృష్ణా జిల్లాతోపాటు కోస్తా జిల్లాలను ప్రభావితం చేయనుంది. జనహితమే పరమావధిగా పుట్టిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి మరో యువకిరణం చేరబోతుంది. కోస్తా
రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రంగా వారసుడిగా రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రానుండటం టిడిపి, కాంగ్రెస్‌ పార్టీల్లో పెద్ద చర్చకే దారి తీసింది. పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత, చిరంజీవితోపాటు కాంగ్రెస్‌లోకి వెళ్లని పీఆర్‌పీ శ్రేణులు రాధా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రానున్నాయి. ఏప్రిల్‌ 27న జగన్ విజయవాడ రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో రాధా వైఎస్ఆర్ కండువా వేయించుకోనున్నారు. ఆయన చేరిక కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలుకుతామని రంగా అభిమానులు అంటున్నారు.


శుక్రవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వస్తున్న జగన్‌ మధ్యాహ్నం 3 గంటల సమయంలో హనుమాన్ జంక్షన్‌ నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. ఆ తర్వాత రామవరప్పాడు నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభమవుతుంది. బెంజిసర్కిల్‌ మీదుగా బీజెంట్‌ రోడ్‌ వరకు ర్యాలీ జగన్‌ను అనుసరిస్తుంది. రంగా విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరుతారు.


బందర్‌ పోర్టు సాధన కోసం రేపు అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఐదవ నంబర్‌ జాతీయ రహదారిపైనే బైక్‌ ర్యాలీ జరగనుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Share this article :

0 comments: