అల్లర్ల బాధితులకు జగన్ అండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అల్లర్ల బాధితులకు జగన్ అండ

అల్లర్ల బాధితులకు జగన్ అండ

Written By ysrcongress on Sunday, April 8, 2012 | 4/08/2012

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: సంగారెడ్డి పట్టణంలో ఇటీవల జరిగిన అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అండగా ఉంటారని వైఎస్సార్ సీపీ ప్రాంతీయ పరిశీలకుడు కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల పార్టీ పరిశీలకులు ఆది శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, కన్వీనర్ బట్టి జగపతితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘సంగారెడ్డిలో జరిగిన ఘటనలు చెరిగిపోని మచ్చ. 

సోదరభావంతో మెలిగే ఇరువర్గాల నడుమ కొన్ని దుష్ట శక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాయి. ప్రాణ నష్టం లేకున్నా ఆస్తి నష్టం భారీగా జరిగింది. దీంతో బాధితులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటించి బాధితులకు అండగా నిలుస్తారు. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు బాధితులను స్వయంగా పరామర్శిస్తారని’ కేకే మహేందర్‌రెడ్డి వెల్లడించారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నాయకులు సి.అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, నగేశ్ యాదవ్, శ్రీధర్ గుప్తా పాల్గొన్నారు.

అధినేత పర్యటన ఏర్పాట్లపై సమీక్ష..
తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సంగారెడ్డిలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ సెంట్రల్ కమిటీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు సమీక్షలో పాల్గొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రామచంద్రాపురం, పటాన్‌చెరు మీదుగా రోడ్డు మార్గం లో సంగారెడ్డికి రానున్నారు. జిల్లా కేంద్రానికి తొలిసారిగా వస్తున్నందున భారీఎత్తున స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నా రు. అల్లర్లు చోటుచేసుకున్న మీది బజారు, పాత బస్టాండ్, గంజ్ మైదాన్, నాల్సాబ్‌గడ్డ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Share this article :

0 comments: