మూణ్ణాళ్లూ... జన పరవళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూణ్ణాళ్లూ... జన పరవళ్లు

మూణ్ణాళ్లూ... జన పరవళ్లు

Written By ysrcongress on Sunday, April 8, 2012 | 4/08/2012

జలనిధులైన నదులు పుట్టిన చోట సన్నగా, చిన్నగా ఉండి... రానురాను భారీ ప్రవాహాలుగా విస్తరిస్తాయి. జనబలమే పెన్నిధిగా కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే పర్యటనలు అందుకు భిన్నమైనవి. అవి మొదలైన చోటి నుంచి ముగిసే చోటి వరకూ ఒకేరీతిలో, అఖండ గోదావరి లాంటి విస్తృతితో- పరవళ్లు తొక్కే ప్రజావాహినుల్లాంటివి. రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన సాగించిన మూడురోజుల పర్యటనకు జనం పోటెత్తారు. 

ఎక్కడెక్కడి వాగులూ, వంకలూ ఉరకలేస్తూ వచ్చి నదిలో కలిసినట్టు- పర్యటన సాగే దారిలో లేని గ్రామాల ప్రజలు తమకు దగ్గరలో జగన్ వచ్చే చోటికి తరలివచ్చారు. రాజా వారి కోట ఉన్న రామచంద్రపురం పట్టణం జననేతపై ప్రేమాదరాలకు పెట్టని కోటగా నిలిచింది. తలమునకలు చేసిన జనాభిమానవర్షంలో జగన్ తడిసి ముద్దయ్యారు. తొలి విడత ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు. మళ్లీ వస్తానంటూ వీడ్కోలు తీసుకున్నారు. 

రామచంద్రపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి :వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన మూడురోజుల పర్యటన శనివారం రాత్రితో విజయవంతంగా ముగిసింది. 

గురువారం రామచంద్రపురంలో రోడ్‌షోతో ప్రారంభమైన పర్యటన కె.గంగవరం, రామచంద్రపురం టౌన్, రామచంద్రపురం రూరల్ మండలాల్లో సాగింది. ఒకపక్క మహానేత వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ మరోపక్క బోస్ విజయాన్ని కోరుతూ, ఇంకోపక్క రాష్ట్రప్రభుత్వ విధానాలతో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న ఈతిబాధలను చేరువగా తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగారు. 

సమీకరణలను అధిగమించిన ఆదరణ
సామాజిక సమీకరణలతో ముడిపడి విలక్షణమైన నియోజవకర్గంగా పేరొందిన రామచంద్రపురంలో వాట న్నింటికీ భిన్నంగా అన్ని వర్గాల నుంచీ జగన్ పర్యటనకు లభించిన ఆదరణ అధికార, విపక్షాలకు గుబులు పుట్టించింది. జగన్‌కు లభించిన ఆదరణపై నిఘావర్గాలు ఎప్పటికప్పుడు అందించిన సమాచారం ప్రత్యర్థులకు మింగుడు పడడం లేదు.

అన్ని గ్రామాల్లో మహిళలు, వృద్ధుల నుంచి చిన్నారుల వరకూ జగన్ వెంట పరుగులు పెట్టడం ఆయనకు గల జనాదరణకు అద్దం పట్టింది. జగన్ తమతో మమేకమవుతూ ముందుకు సాగుతుంటే జనం ‘విపక్ష నేత చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న వ్యత్యాసం ఇదే’ అంటూ చర్చించుకోవడం గమనార్హం. 

దళితవాడల్లో బ్రహ్మరథం
షెడ్యూల్‌లో లేకపోయినా అనేక దళితవాడల్లో స్థానికులు పట్టుబట్టి తమ వాడలోకి తీసుకువెళ్లి ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి సందర్భంలో జగన్ ప్రస్తుత పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఆ తరుణంలో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎనిమిది గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర పాలకుల తీరును తీవ్రస్థాయిలో తూర్పారపట్టారు.

గడప, గడపకు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ పంచిపెట్టేందుకు గుంటూ రు నేతలు రూపొందించిన క్యాలెండర్‌ను కందులపాలెం వద్ద జగన్ ఆవిష్కరించారు. భీమక్రోసుపాలెంలో పింఛన్‌దారులంతా ఒక నెల పెన్షన్ మొత్తాన్ని చందాగా వేసుకుని ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి వారి అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పింఛన్‌ను రూ.700లు చేస్తానని భరోసా ఇచ్చారు. 

అద్దంపల్లిలో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ 400 కుటుంబాలు వీధినపడ్డాయని తెలిసి జగన్ చలించిపోయి ప్రభుత్వం వచ్చిన తరువాత పించన్‌ను రూ.1000లు చేస్తానని, వడ్డీలేని రుణాలు కల్పించి చేనేత కార్మికులు వారి కాళ్లపై వారు నిలబడేలా చూస్తానంటూ వారికి ధైర్యాన్నిచ్చారు. వేగాయమ్మపేట శివారున వరి కోత పనుల్లో ఉన్న కూలీలను చూసి జగన్ కాన్వాయ్‌ను విడిచిపెట్టి నేరుగా పొలంలోకి వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చివరి రోజు పర్యటనలో నందమూరి లక్ష్మీపార్వతి జగన్ వెంట ఉన్నారు.

ప్రజాకోర్టులో నిలుచున్నా... తీర్పు ఇవ్వండి : బోస్
‘వైఎస్ మరణం తరువాత జగన్‌ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు కళ్లారా చూస్తున్నా’రని మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. తాళ్లపొలం సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తనను ఈస్థాయికి తెచ్చి వైఎస్ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని, లేదంటే తనను భగవంతుడు క్షమించడని అన్నారు. జగన్‌కు అండగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ఓటు వేశానని చెప్పారు. ప్రస్తుతం ప్రజాకోర్టులో నిలుచున్న తన నిర్ణయం న్యాయమైనదో, కాదో తీర్పు ఇవ్వాలని కోరారు. 

జగన్‌ను కలసిన పార్టీ నేతలు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : మూడు రోజుల పర్యటనకు రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని శనివారం జిల్లాకు చెందిన పలువురు పార్టీ నేతలు కలుసుకున్నారు. శుక్రవారం రాత్రి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నివాసంలో జగన్ బస చేశారు. శనివారం ఉదయం జగన్‌ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలతో బోస్ నివాసం కిటకిటలాడింది. లక్ష్మీపార్వతి, కొల్లి నిర్మలకుమారి, ఇందుకూరి రామకృష్ణంరాజు, జ్యోతుల నెహ్రూ, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, ఏజేవీబీ మహేశ్వరరావు, అనంత ఉదయభాస్కర్, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, మిండగుదిటి మెహన్, ఆదిరెడ్డి అప్పారావు, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, రెడ్డి ప్రసాద్, బొమ్మన రాజ్‌కుమార్, ఎంఎస్ చక్రవర్తి, శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు, వడ్డి వీరభద్రరావు, గంపల వెంకట రమణ.

గుత్తుల వెంకటరమణ, పంపన రామకృష్ణ, టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆర్.నీరజారాణి, భూపతిరాజు సుదర్శనబాబు, మొగలి బాబ్జీ, గుత్తుల సాయి, మోకా ఆనంద సాగర్, రొంగలి లక్ష్మి, జక్కంపూడి రాజా, కొండేటి చిట్టిబాబు, మామిడాల వెంకటేశ్, పడాల రామారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస్, అడ్డూరి ఫణిరాజు, యనమదల మురళీకృష్ణ, యనమదల గీత, గండి బ్రహ్మరాజు, ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి, ఫ్రూటీకుమార్, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, సత్తి వీర్రెడ్డి, దాడిశెట్టి రాజా, సిరిపురపు శ్రీనివాసరావు, గుత్తుల రాజు, రత్నకుమారి, పంపన పద్మలత, దిట్టకవి అమ్మాజి, కాకిమూడి కుమారి, నీతిపూడి మంగతాయారు, గొల్లి రాఖీకుమార్, హేమంతకుమార్, హర్షద్, రజనీకాంత్ తదితరులు జగన్‌ను కలిశారు.
Share this article :

0 comments: