అధిక శాతం ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధిక శాతం ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్

అధిక శాతం ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్

Written By news on Monday, February 25, 2013 | 2/25/2013

స్త్రీకి ప్రేమ కావాలని చలం అంటే, ఆర్థిక స్వాతంత్య్రం కావాలని కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నారు. ఇప్పుడు స్త్రీకి దక్కుతున్న ప్రేమ, ఆర్థిక స్వాతంత్య్రం ఎక్కడకు చేరుస్తున్నాయో అనిపించే సమయంలో, సరిగ్గా దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్సార్‌గారు స్త్రీలకు చాలా సాయం చేశారు. ఎన్నెన్నో పథకాలకు రూపకల్పన చేశారు. ఆయన తర్వాత జగన్ తప్ప వేరెవ్వరూ ఈ పథకాలను అమలుపరచరని బడుగు బలహీనవర్గాలు, రైతులు, అన్నిజాతుల ప్రజలు భావిస్తున్నారు.

‘క్రమశిక్షణ, సౌశీల్యం, అంతర్‌దృష్టి, మానవీయత, కరుణ మొదలైన గుణాలు లోపించిన నాయకుల చేతుల్లో రాజకీయాలు ఉండటం కంటే అసలు రాజకీయాలు లేకుండా ఉండటమే మేలు. ఏ దేశపు రాజకీయాలకైనా కావలసింది ప్రేమతో కూడిన ప్రేమశక్తి కాని, శక్తి మీద ప్రేమ కాదు. బానిస దేశంలోని సున్నితమైన రాజకీయాల కంటే స్వతంత్ర దేశంలోని మొరటు రాజకీయాలే ఎక్కువ హానికరం. అందుకే ప్రతిదేశపు రాజకీయాలు కూడా సాంస్కృతిక వాతావరణంలో ఆచ్ఛాదితమై ఉండాలి. అప్పుడుకాని మానవ జీవితంలోని ప్రతిరంగంలో కూడా నిజమైన ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయదు’ అని నా సాహితీ గురువు డా. సంజీవ్‌దేవ్ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ జగన్‌కి మంచి భవిష్యత్తు ఉండేలా పలు పార్టీల నాయకులు ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

నేను రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఎక్కువ శాతం ప్రజల అభిప్రాయాలు ఈ ప్రకారమే ఉన్నట్లు కనిపిస్తుంది. పేద ప్రజలను అక్కున చేర్చుకుని, వారి కష్టాలు తొలగించే జగన్‌లాంటి నాయకుని కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుం దని, జగన్ చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతాడని అధిక శాతం ప్రజలు భావిస్తున్నట్లుగా మేధావులు చెప్తున్నారు. వైఎస్సార్ మరణించాక, ఎంపీగా ఉన్న జగన్‌ని కాంగ్రెస్ అధిష్టానం మంత్రిని చేసి, ఇక్కడ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించి ఉంటే పార్టీకి నష్టం వాటిల్లేది కాదని, తప్పటడుగులు వేసి పార్టీ ఇంకా ఇంకా బలహీనమైపోతోందని కాంగ్రెస్ పార్టీ అభిమానులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. 

‘పరుల కోసం పాటుపడని బతుకెందుకని - మూగనేలకు నీరందివ్వని వాగు పరుగులెందుకని’ అన్న సినారె మాటలు మననం చేసుకుంటున్నారు చాలామంది. ఒకపక్క కరెంటు కోతలు, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, పారిశ్రామిక సంస్థల అధినేతలు కంటికి నిద్ర కరువై తల్లడిల్లిపోతున్నారు. కంపెనీల యజమానులు బ్యాంక్ రుణాలు చెల్లించలేక, తమ సంస్థల్లో పనిచేస్తున్నవారికి సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. జగన్ జైలు నుండి బయటకొచ్చి తమను ఆదుకుంటాడని పేద ప్రజానీకం ఎదురుచూస్తోంది. 

‘ఆకు రాలిపోతేనేమి చిగురాకులు పుట్టవా - నీళ్లు ఇగిరిపోతేనేమి నీలిమబ్బులు గజ్జె కట్టవా’ అన్న సినారె మాటలు నిజం కావా? అని మేధావులు అనుకుంటూ జీవితానికి వెలుగు ప్రేమించబడటమే అంటున్నారు. రాష్ట్రంలో పలు సభల్లో పాల్గొంటున్న జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పరిపూర్ణమైన స్త్రీలుగా రూపుదిద్దుకున్నట్లుగా ప్రజలంతా భావిస్తున్నారు. దేశ భవిష్యత్తు, పేదవారి బాగుకోసం ఆలోచించడం, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వీరి కుటుంబం పరిష్కారం చూపుతుందని నమ్ముతున్నారు.

రాష్ట్రంలో పలు వనరులున్నాయి. కొద్దిమంది ధనంలో ఓలలాడి, అత్యధికులు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ పరిస్థితిలో జగన్ ఒక్కడే పేదలను కాపాడగలడని అధికశాతం నమ్ముతున్నారు. ఒక నాయకుడిగా ఏమి చేయాలో గ్రహించిన వ్యక్తి, తండ్రి చనిపోయాక ఎక్కువ సమయం ప్రజల మధ్యనే ఉన్నాడతడు. లీడర్ అనేవాడు ప్రజల మధ్య నుండే బయటికొస్తాడు. అలా వచ్చినవాడే జగన్. ఓదార్పు యాత్ర అతనికి ఒక ‘టానిక్’ అనేది నిజం.

- జంగా గాంధీజీ, రచయిత, చారిత్రక పరిశోధకులు, బిక్కవోలు, తూ.గో. జిల్లా
Share this article :

0 comments: