బాబూ.. జవాబు చెప్పు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. జవాబు చెప్పు?

బాబూ.. జవాబు చెప్పు?

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013

చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తూ గట్టు ఒక చార్జీషీటు విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వ్యవ సాయం, దాని అనుబంధ వృత్తుల నుంచి చేతి వృత్తుల వరకూ అన్నింటిలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థను తీసుకొచ్చి సర్వనాశనం చేసింది నిజం కాదా? చిన్న, సన్నకారు వృత్తులకు చెందిన దాదాపు 70 లక్షల కుటుంబాలను గాలికొదిలేసింది మీరు కాదా? కౌలు రైతుల్లో 80 శాతం మంది బీసీలు ఉంటే వారికి మీ హయాంలో కనీసం గుర్తింపుకార్డులైనా ఇచ్చారా? రుణాలు ఇప్పించారా? రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని ఎందుకు అనిపించలేదు. వారి కరెంటు బకాయిలు రద్దు చేయాలని కానీ, రుణాలు మాఫీ చేయించాలని కానీ ఎందుకు ఆలోచించలేదు?
హైటెక్ పాలన పేరుతో కులవృత్తులు, చేతి వృత్తులు, కళాకారుల జీవితాలను ధ్వంసం చేశారు. బిల్ క్లింటన్, బిల్‌గేట్స్ జపం చేస్తూ ప్రపంచబ్యాంకుకు ఊడిగం చేసింది నిజం కాదా? 
ఆదరణ పథకం కింద రూ.625 కోట్లు పచ్చచొక్కాలకు పంపిణీ చే శారు. ఆ పథకం కింద వస్తువుల పంపిణీ చేసిన పరిశ్రమలు ఒక్కటైనా ఇప్పుడున్నాయా? అవన్నీ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి మీరు సృష్టించిన బినామీ కంపెనీలు కాదా? 
స్కాలర్‌షిప్‌లు అడిగితే లాఠీ దెబ్బలు తినిపించిన విషయాన్ని విద్యార్థులు మరిచిపోతారనుకున్నారా? మీ పాలనలో బీసీ విద్యార్థుల మెస్‌చార్జీలు ఒక్క రూపాయి అయినా పెంచారా? 
చేనేత కార్మికులు ఆత్మహత్యల బాట పట్టింది మీ హయాంలోనే. వారికి మీరిచ్చిన పెన్షన్ 3 నెలలకోసారి ముష్టి వేసినట్లుగా రూ.75 మాత్రమే కాదా?
బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది మీరే కదా? బీసీ సంక్షేమానికి నిధులు ఇవ్వటానికి మీకెందుకు మనసు రాలేదు? ఆప్కోను నిర్వీర్యం చేశారు. ఆప్టెక్ట్స్‌లను రద్దు చేసిందీ మీరే. ఎన్టీఆర్ జనతా వస్త్రాలను కూడా రద్దు చేశారు. సహకార రంగంలో చేతివృత్తుల వారికి రూ.11 ఉన్న సభ్యత్వ రుసుమును రూ.300కు పెంచింది మీరే కదా?
కల్లు గీత కార్మికుల నుంచి మూడు రకాల శిస్తులను వసూలు చేసిన మాట వాస్తవం కాదా? వైఎస్ వాటిని రద్దుచేసి, రూ.25 దాటకుండా గీత కార్మికులకు మేలు చేసింది నిజం కాదా?
రూ.2 కే కిలో బియ్యం పథకాన్ని రూ.3.50కి, తర్వాత రూ.5.25కు పెంచింది మీరు కాదా?
హార్స్ పవర్‌కు రూ.50 ఉన్న వ్యవసాయ విద్యుత్ చార్జీలను రూ.625కు పెంచారు. బిల్లులు చెల్లించలేని పేద, బడుగు రైతాంగాన్ని వేధించటానికి ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు, కోర్టులు ఏర్పాటు చేసి రైతుల చేతి గోళ్ళు ఊడగొట్టింది మీరేకదా? 
మీ హయాంలో వృద్ధులకు పింఛను రావాలంటే.. లబ్ధిదారుల్లో ఎవరైనా ఒకరు చనిపోతే వారి పింఛను తమకు వస్తుందన్నట్టుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన మాట నిజం కాదా? 
బీసీలకు ఏనాడైనా ఒక్క ఎకరా భూమి పంచారా చంద్రబాబూ? భూమి లేని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు లక్షల్లో ఉన్నారని కానీ, వారికి రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కానీ ఏనాడైనా ఆలోచించారా?
Share this article :

0 comments: