‘ట్విట్టర్ బాబూ... అసలు ద్రోహి మీ నాన్నే!’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ట్విట్టర్ బాబూ... అసలు ద్రోహి మీ నాన్నే!’

‘ట్విట్టర్ బాబూ... అసలు ద్రోహి మీ నాన్నే!’

Written By news on Wednesday, February 20, 2013 | 2/20/2013


 ‘తెలుగుదేశంలో రాజకీయం జీవితం పొంది పార్టీని వీడే వారందరూ ద్రోహులు, మోసగాళ్లు...’ అంటూ చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. లోకేష్ మాటలే నిజమైతే అసలైన ద్రోహి, వెన్నుపోటుదారుడు చంద్రబాబే అవుతారని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ ఆవరణలో మంగళవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ‘‘ట్విట్టర్ బాబూ.. దగా, వెన్నుపోటు, ద్రోహానికి కేరాఫ్ మీ నాన్నే. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం పొంది, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేపట్టిన మీ నాన్న.. పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌పైనే పోటీకి దిగుతానని ప్రగల్భాలు పలికి ఎన్నికలైపోగానే కాంగ్రెస్‌ను వదిలి మామ పంచన చేరిన ద్రోహి. అంతటితో ఆగక సొంత మామకే వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం ఎక్కిన మోసగాడు. అలాంటి చంద్రబాబు గురించి వాస్తవాలు లోకేష్ ట్విట్టర్లో రాస్తే మంచిది..’’ అని సూచించారు.
Share this article :

0 comments: