అంగ‌న్‌వాడీ టీచర్లకోసం వైఎస్సార్‌సీపీ పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంగ‌న్‌వాడీ టీచర్లకోసం వైఎస్సార్‌సీపీ పోరాటం

అంగ‌న్‌వాడీ టీచర్లకోసం వైఎస్సార్‌సీపీ పోరాటం

Written By news on Sunday, February 17, 2013 | 2/17/2013

అంగన్‌వాడీ టీచర్లకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేందుకు వైయస్సార్‌సీపీ సన్నద్ధమయింది. పార్టీకి అనుబంధంగా ఓ యూనియన్‌ను పార్టీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలిసారిగా అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ నేత జనక్ ప్రసాద్, బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు గట్టు రామచంద్రరావుతోపాటు అంగన్ వాడీ టీచర్ల యూనియన్ రాష్ట్ర నాయకురాలు అనసూయ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి అంగన్ వాడీ టీచర్లు హాజరయ్యారు. దివంగత మహా నేత వైయస్ఆర్‌ మాత్రమే గతంలో అంగన్ వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, తర్వాత వచ్చిన ఏ నాయకుడూ తమ గోడు పట్టించుకోవటంలేదని వారు వాపోయారు.
Share this article :

0 comments: