బాంబు పేలుళ్లపై విజయమ్మ దిగ్భ్రాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాంబు పేలుళ్లపై విజయమ్మ దిగ్భ్రాంతి

బాంబు పేలుళ్లపై విజయమ్మ దిగ్భ్రాంతి

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయంత్రం వరుస బాంబు పేలుళ్ల ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆమె సంతాపాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వై.ఎస్.విజయమ్మ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 


నగరంలోని రద్దీ ప్రదేశమైన దిల్ షుఖ్ నగర్ ప్రాంతంలోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అనుమానస్పదంగా వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్క్షప్తి చేశారు. 

నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుళ్లు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పేలుళ్ల సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఉస్మానియా, ఓమ్నీ, మలక్‌పేట యశోదా ఆస్పత్రులకు తరలించారు. ఉస్మానియా లో 25 మంది, ఓమ్ని 12 , యశోదాలో 15 మంది క్షతగాత్రులను తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Share this article :

0 comments: