పోరాటమే మార్గం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోరాటమే మార్గం

పోరాటమే మార్గం

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యల పరిష్కారంకోసం వారికి అండగానిలిచి పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దిశానిర్దేశం చేసిన తర్వాత జిల్లాల వారీగా పార్టీ సంస్థాగత అంశాలను పరిశీలించారు. 23 జిల్లాలకు చెందిన నాయకులు 8 గ్రూపులుగా ఏర్పడి సభ్యత్వ నమోదును సమీక్షించారు. విజయమ్మ జిల్లా పర్యటనల నాటికి ఆయా జిల్లాల్లో చేయాల్సిన పనులను నేతలకు వివరించారు. 

అంతకుముందు రైతు సమస్యలు, పెరిగిన నిత్యావసరాల ధరలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై విస్తృతచర్చ జరిగింది. వైఎస్ దూరమైన ఈ మూడున్నరేళ్లలో రైతులకు కన్నీరే మిగిలిందని పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు రూ.9 వేల కోట్లు నష్టపోయారని, చంద్రబాబు హయాంలో మాదిరి ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. బాబు హయాంలో 107 లక్షల టన్నులుగా ఉన్న ఆహారధాన్యాల ఉత్పత్తిని వైఎస్ ఐదేళ్లలో 204 టన్నులకు పెంచగా... ప్రస్తుతం మళ్లీ 170 టన్నులకు పడిపోయిందని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఆదుకుంటామని సీఎం కిరణ్ పేపర్ ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వైఎస్ ఉన్నప్పుడు ఉన్నంత ధైర్యంగా రైతులు ఇప్పుడులేరని పార్టీ శాసనసభా పక్షం ఉపనాయకురాలు శోభా నాగిరెడ్డి చెప్పారు. 

పార్టీ ప్లీనరీలో ప్రకటించినట్టుగానే వ్యవసాయానికి ప్రత్యేకంగా రూ.మూడువేల కోట్లు కేటాయించాలని పార్టీ ట్రేడ్‌యూనియన్ కన్వీనర్ జనక్‌ప్రసాద్ అన్నారు. ఆడపడుచులకు పావలావడ్డీకే రుణాలు అందజేసిన ఘనత వైఎస్‌కు మాత్రమే దక్కుతుందని పార్టీ సీజీసీ సభ్యురాలు బాలమణెమ్మ చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా లబ్ధిపొందారని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు రెండెకరాలు కేటాయించి ఆర్థికంగా ఆదుకున్నారని, వారికోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలని పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ సూచించారు. విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, బి.గురునాథరెడ్డి, టి.బాలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తానేటి వనిత, పేర్ని నాని, సుజయకృష్ణ రంగారావు, బాలనాగిరెడ్డి, కొడాలి నాని, మద్దాల రాజేష్, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పి.సాయిరాజ్, పార్టీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్, పీఎన్వీ ప్రసాద్‌లతోపాటు సీజీసీ, సీఈసీ, జిల్లాల కన్వీనర్లు, పరిశీలకులు, కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగం రాష్ట్ర కన్వీనర్లు, అధికార ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. డీసీసీబీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు.
Share this article :

0 comments: