కువైట్ లో విజయమ్మ జన్మదిన వేడుకలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కువైట్ లో విజయమ్మ జన్మదిన వేడుకలు

కువైట్ లో విజయమ్మ జన్మదిన వేడుకలు

Written By news on Sunday, April 21, 2013 | 4/21/2013


కువైట్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను కువైట్ లోని మలియా ప్రాంతములో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కువైట్ సభ్యులు 50 కేజీల కేక్ కట్ చేశారని కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ తెలిపారు. మలియా ప్రాంతములో 1000 మందికి అన్నదానం చేశామని పేర్కొన్నారు. కువైట్ లో వైఎస్ కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం ఉందని, వైఎస్సార్ పార్టీ రాష్ట్రంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కువైట్ లోనూ జరపడమే దీనికి నిదర్శనమన్నారు. 

సభ్యులు మాట్లాడుతూ... కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణం పోశారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి రాజకీయ కక్షతో వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రవాసులు హామీయిచ్చారు. 

ఈ కార్యక్రమములో సి. చంద్రశేఖర్ రెడ్డి, యమ్. వి. నరసా రెడ్డి, యన్. మహేష్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, గోవింద్ నాగరాజ్, తట్టు రాఫి, రెహమాన్ ఖాన్, యమ్. బాలి రెడ్డి, టి. దుర్గా రెడ్డి, టి. జి. భాస్కర్ రెడ్డి, షేక్ ఇనయాత్, యమ్. చంద్ర శేఖర్ రెడ్డి, షేక అన్సార్, వినోద్, బాబురాయుడు, వెంకట్ రెడ్డి, సయ్యద్ నూర్, యన్.చంద్రషేఖర్ రెడ్డి ఫహహిల్ సునీల్, వాసు రెడ్డి, షేక్ ఫయాజ్, న్యాయజ్, అజిస్ , కళ్యాణ్, కుమార్, రమణ పాల్గొన్నారు.
Share this article :

0 comments: