ఈడీ వాదనలు వెనక బాబు, చిదంబరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈడీ వాదనలు వెనక బాబు, చిదంబరం

ఈడీ వాదనలు వెనక బాబు, చిదంబరం

Written By news on Sunday, April 21, 2013 | 4/21/2013

వారి లాలూచీ ఫలితంగానే అడ్డగోలు వాదనలు: బాలినేని
కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కుకు కూడా నిదర్శనమిది
‘ఈనాడు’ రాగం, సీబీఐ తాళం, ఈడీ పల్లవి
వైఎస్సార్‌సీపీ ప్రెస్ మీట్లను రాయని ఎల్లో మీడియా
టీడీపీ అవాకులకు పేజీలకు పేజీలు కేటాయిస్తారు
‘సాక్షి’తో పోటీ పడలేకే ‘ఈనాడు’లో జగన్ వ్యతిరేక వార్తలు
వైఎస్సార్‌సీపీ ప్రభావంపై సర్వేకు సిద్ధమా?


 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం లాలూచీ ఫలితంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వ్యతిరేక వాదనలు చేస్తోందని మాజీ మంత్రి, పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌ను ఉద్దేశించి గజనీ అంటూ ఈడీ న్యాయవాది విపుల్‌కుమార్ చేసిన వాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌కు వ్యతిరేకంగా ‘ఈనాడు’లో ఏది రాస్తే చంద్రబాబు అదే మాట్లాడ్డం సైకిల్ చక్రం తిరిగిన చందంగా ఎప్పటి నుంచో తయారైంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా చేరిపోయి అదే సైకిల్ చక్రాన్ని తిప్పుతోంది.

ఈనాడు రాసిన దాన్నే సీబీఐ తన చార్జిషీట్లలో వేయడం, ఈడీ కూడా ప్రాధికార సంస్థ ముందు దాన్నే వాదించడం జరుగుతోంది. ఇదంతా చూస్తూంటే ఈనాడు రాగం, సీబీఐ తాళం, ఈడీది పల్లవిలా తయారైంది’’ అంటూ దుమ్మెత్తిపోశారు. ఆయన శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోరి ప్లస్ గజనీ అంటూ జగన్‌పై టీడీపీ నేత దాడి వీరభద్రరావు 2012 జూన్ 9న విలేకరుల సమావేశంలో లేనిపోని ఆరోపణలు చేయడం, దాన్ని ‘ఈనాడు’ ఫుల్ పేజీ మ్యాప్‌తో సహా దాడి చెప్పని విషయాలను కూడా జోడించి మరీ ప్రచురించడాన్ని బాలినేని గుర్తు చేశారు. విచిత్రమైన రీతిలో, ఈడీ న్యాయవాది కూడా అవే రాతలను తన వాదనలో విన్పించారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘‘ఒక గోరి, ఒక గజనీతో జగన్‌ను పోల్చారంటేనే ఈ వాదన నేరపూరితమని మా పార్టీ భావిస్తోంది. టీడీపీ వాదనను ఈడీ భుజాన వేసుకుంది. కాంగ్రెస్, టీడీపీ ఎంతగా కుమ్మక్కయ్యాయో దీన్నిబట్టి ఇట్టే అర్థమవుతోంది. టీడీపీ చెప్పిందే ఈడీ చేస్తోంది. మా ప్రెస్ మీట్లను సింగిల్ కాలమ్ కూడా ప్రచురించని ఈనాడు, దాడి ప్రెస్ మీట్‌ను మాత్రం పెద్దగా అచ్చేసింది. కేవలం ‘సాక్షి’తో పోటీ పడలేక ఈనాడులో జగన్‌కు వ్యతిరేక వార్తలు రాస్తున్నారు. గాలి జనార్దనరెడ్డికి, జగన్‌కు సంబంధమున్నట్టు ఆపాదించే కథనాలు ప్రచురిస్తోంది. గాలికి ఇచ్చిన గనుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని నేనే పర్మిట్లను రద్దు చేశాను’’ అని బాలినేని గుర్తు చేశారు. ‘‘హైకోర్టు స్టేను పురస్కరించుకుని కిందిస్థాయిలో మళ్లీ తవ్వకాలకు అనుమతిచ్చిన ఏడీని సస్పెండ్ చేయడమే గాక అప్పటి గనుల సంస్థ డెరైక్టర్ రాజగోపాల్‌ను సెలవుపై పంపాం. నిజంగా గాలితో జగన్‌కు సంబంధముంటే నేనెందుకు ఈ పని చేస్తాను? నేను మంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏనాడూ గాలి గనులకు సంబంధించి గానీ, మరో వ్యవహారంలో గానీ నాకు ఏమీ చెప్పలేదు. దేవుడి సాక్షిగా ఈ విషయం చెబుతున్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.

బయ్యారం గనులను పదో వంతుకు కొనండి
బయ్యార ం ఇనుప గనుల విలువ రూ.14 లక్షల కోట్లనీ, వాటిని వైఎస్ రాజశేఖరరెడ్డి తన అల్లునికి కట్టబెట్టే యత్నం చేశారని టీడీపీ అబద్ధపు ఆరోపణలకు దిగిందంటూ బాలినేని ధ్వజమెత్తారు. ‘‘అవే గనులను సగానికి, అంటే రూ.7 లక్షల కోట్లకు టీడీపీ కుబేరుడైన నామా నాగేశ్వరరావుతో కొనుగోలు చేయించండి. అంతొద్దనుకుంటే రూ.5 లక్షల కోట్లకు కొనమనండి. లేదంటే పోనీ, 10 శాతం ధరకే, అంటే రూ.1.4 లక్షల కోట్లకు కొనుగోలు చేస్తారేమో చెప్పమనండి. గతంలో పాలేరు చక్కెర ఫ్యాక్టరీని నామాకు ధారాదత్తం చేశారు కదా! ఇదీ అలాగే తీసుకోండి’’ అంటూ సవాలు విసిరారు. తాను రోశయ్య మంత్రివర్గంలో గనుల మంత్రిగా ఉన్నప్పుడే బయ్యారం గనుల లీజు రద్దుకు స్వయంగా ఫైల్ పెట్టానని గుర్తు చేశారు. అనిల్‌కు సంబంధాలున్నట్లు అసెంబ్లీలో విమర్శలు వచ్చాకే తానీ నిర్ణయం తీసుకున్నానని, సచివాలయ రికార్డులను తిరగేస్తే ఈ విషయం తెలుస్తుందని వివరించారు. తనను ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని కాంగ్రెస్ అంటే ఆ మాట వినకుండా జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని గుర్తు చేశారు. అలాంటి తానే బయ్యారం లీజును కూడా రద్దు చేశానన్నారు. కేవలం జగన్‌ను ఇరికించడానికే ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి) అసంబద్ధ రాతలు రాస్తున్నాయంటూ దుయ్యబట్టారు.

నిష్పాక్షిక సర్వేకు సిద్ధమా...!
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రాభవం తగ్గిందంటూ ‘టైమ్స్ నౌ’ సర్వేను పట్టుకుని బాకాలూదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దీనిపై నిష్పాక్షిక సర్వే నిర్వహించడానికి సిద్ధపడతాయా అని బాలినేని సవాలు విసిరారు. రాష్ట్రంలో జగన్‌కు అనుకూల వాతావరణం ఉందని ‘ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడించడాన్ని ఆయన గుర్తు చేశారు. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి దానినెందుకు ప్రచురించలేదని సూటిగా ప్రశ్నించారు. టైమ్స్ నౌ సర్వేను మాత్రమే పెద్దదిగా చేసి ఎందుకు ప్రచురించారని నిలదీశారు. ‘‘అసలు మీరూ వద్దు, మేమూ వద్దు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మంచి పేరున్న నిష్పాక్షిక సంస్థతో సర్వే చేయిద్దాం. అందుకయ్యే ఖర్చులో సగం మేమూ భరిస్తాం. మీరు ముందుకొస్తారా?’’ అంటూ ఆ రెండు పత్రికలకు సవాలు విసిరారు. ‘‘టీడీపీకి 9, కాంగ్రెస్‌కు 8 లోక్‌సభ స్థానాలు వస్తాయన్న టౌమ్స్ నౌ సర్వేను ప్రచురించారు కదా! అన్ని వద్దు. వాటికి చెరో 4 స్థానాలొస్తాయని నిష్పాక్షిక సర్వేలో వెల్లడైతే చాలు, నన్ను మీరేం చేసినా సిద్ధమే’’ అని ఆయనన్నారు.

సబిత స్థానంలో నేనుంటే అరెస్టు చేసేవారే
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానంలో గనుక తానుండి ఉంటే కనీసం ఆరు నెలల కిందటే తనను అరెస్టు చేసేవారని బాలినేని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ వ్యవహారంలో నన్ను ఇరి కించాలని సీబీఐ సర్వవిధాలా ప్రయత్నించింది. అయితే వారికేమీ దొరకలేదు. సబితను అరెస్టు చేయాలన్నది నా అభిమతం కాదు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్నందునే ఊరుకున్నారు. నేనే గనుక సబిత మాదిరిగా అప్పట్లో గనుల మంత్రిగా ఉండి ఉంటే ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉన్నందుకు అరెస్టు చేసి ఉండేవారు. జగన్ పరిస్థితి కూడా అదే. కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఉండేవారు’’ అని అన్నారు.

ప్రమాణం చేయలేదా?
రాష్ట్ర ప్రభుత్వం నుంచి జారీ అయిన జీవోలన్నీ మంత్రివర్గ సమష్టి నిర్ణయాలేనని బాలినేని స్పష్టం చేశారు. జీవోల జారీకి మొత్తం మంత్రివర్గం బాధ్యత వహించాల్సిందేనన్నారు. ‘వైఎస్ చెబితే సంతకాలు చేశారని కొందరు మంత్రులు మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ మంత్రివర్గంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలే. వైఎస్ ఒత్తిడి చేస్తే సంతకాలు చేశామంటున్న వారు రాజ్యాంగంపై ప్రమాణం చేశారా, లేక వైఎస్ ఏది చెబితే అది చేస్తామని ప్రమాణం చేశారా? ఈ అంశాలను మంత్రివర్గంలో చర్చించలేదా? సమాధానం చెప్పమనండి. చర్చించి ఉంటే, వారు ఇష్టపడితేనే నిర్ణయం తీసుకున్నారా? ఇష్టం లేకపోతే ఆరోజే డిసెంట్ (అసమ్మతి) రాసి ఉండొచ్చు కదా! అలా ఎందుకు చేయలేదు?’ అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: