నీది కూరగాయల పార్టీయా? హెరిటేజ్ పాల పార్టీయా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీది కూరగాయల పార్టీయా? హెరిటేజ్ పాల పార్టీయా?

నీది కూరగాయల పార్టీయా? హెరిటేజ్ పాల పార్టీయా?

Written By news on Monday, April 22, 2013 | 4/22/2013

హెరిటేజ్ పాల పార్టీయా? 
చంద్రబాబుపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధ్వజం 
వెన్నుపోట్లు, సూట్‌కేసులు మోసిన చరిత్ర నీది
తెలుగుదేశం పార్టీ కుంగిపోయి కుంటుతోంది
కాంగ్రెస్, టీడీపీలను కలిపి బండకు కొడ్తం
టీడీపీ ఎమ్మెల్యేలు బయటకొస్తోంటే 
రాధాకృష్ణకు ఏడుపొస్తోంది
బాబును కాపాడటం ఆంధ్రజ్యోతి ఎండీ వల్ల కాదు


సాక్షి, హైదరాబాద్: తమది ఫార్మ్‌హౌస్ పార్టీ అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిది కూరగాయల ఫ్యాక్టరీయా? హెరిటేజ్ పాల ఫ్యాక్టరీయా? అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. నిన్ను పిల్లిగడ్డం, బొల్లి బాబు అని పిలవాల్నా? అని ప్రశ్నించారు. సూట్‌కేసులు మోసిన చరిత్ర, వెన్నుపోట్ల చరిత్ర చంద్రబాబుదని, ఆయన పార్టీయే సూట్‌కేసుల పార్టీ అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును 100 శాతం నాశనం చేస్తామన్నారు. ఒక్క సీటు కూడా ఇవ్వమన్నారు. అలాగే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ప్రకటించిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఆయన పార్టీకి ఒక్క ఓటూ వెయ్యమని చెప్పారు. తెలివికలిగిన ధోబీ చీరను, రవికను కలిపి బండకు కొట్టినట్లే తాము కూడా కాంగ్రెస్‌ను, టీడీపీని కలిపే బండకు కొడతామని పేర్కొన్నారు.

చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవాలని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడని, ఏం చేసినా చంద్రబాబును కాపాడటం ఆయన వల్లకాదని స్పష్టం చేశారు.‘చంద్రబాబుది సొల్లుపురాణం. టీడీపీ కుంగిపోయి కుంటుతోంది. 

అధికారంలోకి వస్తమనే ఆశ చంద్రబాబుకు లేదు, ఆ పార్టీ నాయకులకు అసలే లేదు. ఆ నిరాశా నిస్పృహలతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నడు. సూట్‌కేసుల సంస్కృతి చంద్రబాబుది. సూట్‌కేసులు మోసి, రాజకీయాల్లో ఏ స్థాయికి చేరిండో అందరికీ తెలుసు. అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్‌తో నగ్నంగా, నిస్సిగ్గుగా అంటకాగలేదా? లీటరు పాలకు 24 రూపాయలుంటే దానిని తగ్గించి 17 రూపాయలు ఇస్తూ రైతులను నిండా ముంచి హెరిటేజ్‌ను లాభాల్లో నడిపిస్తలేవా? పాల సేకరణ ధరను తగ్గించిన నీది పాల పార్టీ అనాల్నా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చంద్రబాబుకు మంచిది’ అని కేసీఆర్ హెచ్చరించారు.

ఆంధ్రజ్యోతి దరిద్రపుగొట్టు పేపర్: ‘టీడీపీ నుండి ఎమ్మెల్యేలు బయటకు వస్తుంటే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఎక్కడాలేని ఏడుపొస్తున్నది. ఏమన్నా చేసి చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నడు. అదో దరిద్రపుగొట్టు పేపర్. జస్టిస్ కట్జూ కూడా ఆంధ్రజ్యోతిని దులిపేసిండు. తెలంగాణ ఉద్యమంపై, టీఆర్‌ఎస్‌పై రాధాకృష్ణ విషం చిమ్ముతున్నడు. మామూలు వ్యక్తిగా ఉన్న రాధాకృష్ణ ఒక పేపర్‌ను ఎలా పెట్టిండో లోకానికి తెలియదా? అలాంటి వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా రాధాకృష్ణకు కొన్ని కోర్కెలు, సిద్ధాంతాలున్నయి. ఏమన్నా చేసి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే రాధాకృష్ణ ఆశయం. 

ఒక్క రాధాకృష్ణ కాదు లక్షమంది రాధాకృష్ణలు అయినా బాబు పార్టీని కాపాడలేరు. ఒక్క గంగుల కమలాకర్ వస్తేనే ప్రపంచం తలకిందులైపోయినట్లు ఎడిటోరియల్ రాసిండు. టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నవారికి నైతిక విలువల్లేవని, పనికిరాని వారని చిత్రీకరిస్తున్నడు. టీడీపీలోకి వస్తే సంతోషం, విడిచి పెడితే ఎక్కడాలేని దు:ఖం. ఇవేనా పత్రికా విలువలు? ఇలాంటివి మార్చుకోవాలనే ధర్నాలు చేసినం. అయినా అవే రాతలు రాస్తే బుద్ధి చెప్తం’ అని కేసీఆర్ హెచ్చరించారు. 


Share this article :

0 comments: