షర్మిల పాదయాత్రకు డాక్టర్ల మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పాదయాత్రకు డాక్టర్ల మద్దతు

షర్మిల పాదయాత్రకు డాక్టర్ల మద్దతు

Written By news on Tuesday, March 26, 2013 | 3/26/2013

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా కృష్ణాజిల్లాలో పార్టీ అనుబంధ వైద్య విభాగం తరఫున 1000 మంది డాక్టర్లు పాల్గొననున్నట్లు ఆ విభాగం కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అందుకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. అనంతరం శివభరత్ మాట్లాడుతూ... షర్మిల పాదయాత్రకు మద్దతుగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వెయ్యి మంది డాక్టర్లు సంఘీభావం తెలపుతూ పాదయాత్రలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల లబ్దిపొందిన వైద్య విద్యార్థులు, 108, 104, ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా పాల్గొని షర్మిలకు వారు పడుతున్న ఇబ్బందులను వివరించనున్నట్లు తెలిపారు.
Share this article :

0 comments: