పులి బోనులో ఉన్నా పులే: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులి బోనులో ఉన్నా పులే: షర్మిల

పులి బోనులో ఉన్నా పులే: షర్మిల

Written By news on Tuesday, March 26, 2013 | 3/26/2013

రాష్ట్రంలో మానవత్వం లేని ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కిరణ్ సర్కారు ఘోరంగా విఫలమయిందన్నారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ లో జరిగిన బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కరెంట్ లేదని అడిగితే.. కిటికీలు, తలుపులు తెరుచుకోమని ఉచిత సలహాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కరెంట్ చార్జీలు చూస్తే షాక్ కొడుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వస్త్రాలపై ఐదు శాతం వ్యాట్ విధించిందని తెలిపారు.
18 రోజులుగా వస్త్ర వ్యాపారులు నిరాహార దీక్ష చేస్తున్నా స్పందించకుండా ప్రభుత్వం బండరాయిలా కూర్చుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎవరికీ భరోసా లేదన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రం అతలాకుతలమయిందన్నారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తూ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రజలను వెన్నుపోటు పొడిచి చరిత్ర హీనుడిగా మిగిలి పోయారన్నారు. జగనన్న బయటవుంటే వీళ్ల ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఆయనను జైలుకు పంపారని షర్మిల అన్నారు. పులి బోనులో ఉన్నా పులే అన్నారు. జగనన్న బయటకు వచ్చి రాజ్యన్న రాజ్యం దిశగా నడిపిస్తారని భరోసా ఇచ్చారు. తనకోసం వచ్చిన వారందరికీ షర్మిల ధన్యవాదాలు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజీపైకి రాగానే షర్మిలకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బ్యారేజీ జనంతో నిండిపోయింది. బ్యారేజీ అంతా జైజగన్ నినాదాలతో హోరెత్తింది. కృష్ణా జిల్లాలో ఆమె 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. దాదాపు 300 కిలోమీటర్లు నడుస్తారు. ఈ సాయంత్రం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు.
Share this article :

0 comments: