చరిత్ర హీనుడుగా మిగిలిన బాబు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చరిత్ర హీనుడుగా మిగిలిన బాబు: షర్మిల

చరిత్ర హీనుడుగా మిగిలిన బాబు: షర్మిల

Written By news on Wednesday, March 27, 2013 | 3/27/2013

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆమె ఈరోజు డాబాకొట్టు సెంటర్ లో బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్టీఆర్ పార్టీని, ఆయన కుర్చీనీ లాగేసుకున్నారన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపులు పెట్టించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. బాబు పాలనలో రాష్ట్ర ప్రజలు పొట్టకూటి కోసం వలసవెళ్లారని తెలిపారు. పేద ప్రజలు, రైతులు అల్లాడారని చెప్పారు. బాబు ఎప్పుడూ సామాన్యులు, పేదలు, రైతుల గురించి ఆలోచన చేయలేదన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం బాబు అడుగుజాడల్లోనే నడుస్తోందన్నారు. మీ అడుగుజాడల్లో నడుస్తున్న ప్రభుత్వం, మీ మాదిరే విద్యుత్ చార్జీలు పెంచితే ఎందుకు అభ్యంతరం అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్ తో కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము వీరికి లేదన్నారు. జగనన్న బయట ఉంటే ప్రజల మనసులలో వైఎస్ వారసుడిగా పేరు సంపాధించుకుంటాడని వారి భయం. అదే జరిగితే ఆ రెండు పార్టీల తలుపులు మూసివేయవలసి వస్తుంది. అందువల్లే సిబిఐ వెనక దాక్కొని వారు జగనన్నను జైలులో పెట్టించారన్నారు. ప్రజా ప్రయోజనాలను టీడీపీ తాకట్టు పెట్టిందని విమర్శించారు. అవిశ్వాసానికి మద్దతివ్వకుండా ఇప్పుడు దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

బోనులో ఉన్నా సింహం సింహమేనని చెప్పారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. జగన్న వచ్చి రాజన్న రాజ్యం తెస్తారు, ఆయన మాట నిలబెడతారని భరోసా ఇచ్చారు. జగనన్న పాలనలో మహిళలకు వడ్డీలేకుండానే రుణాలు ఇస్తారని చెప్పారు. వైఎస్ఆర్ బతికుంటే బుడమేరు ముంపు సమస్య ఉండేది కాదన్నారు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు, పింఛన్లు సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. మద్యం షాపులను మూయించి మహిళా పోలీసులతో మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు.

బహిరంగ సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఆమె పాదయాత్రకు విజయవాడలో అపూర్వ స్పందన లభిస్తోంది. షర్మిల వచ్చిన సందర్భంగా బెజవాడ జనవాడగా మారింది.
Share this article :

0 comments: