రెండు పార్టీల కుతంత్రానికి వ్యతిరేకంగా ఓటేశా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు పార్టీల కుతంత్రానికి వ్యతిరేకంగా ఓటేశా

రెండు పార్టీల కుతంత్రానికి వ్యతిరేకంగా ఓటేశా

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013


‘‘ఇటీవల జరిగిన అవిశ్వాస సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడా, వ్యతిరేకంగా ఉంటాడా అన్న సందిగ్ధ సమయంలో నా ఆత్మ సాక్షిగా.. ప్రస్తు తం జరుగుతున్న కుటిలమైన రాజకీయానికి, ప్రభుత్వానికి, రెండు పార్టీల కుతంత్రానికి వ్యతిరేకంగా ఓటు వేశాను’’ అని కృష్ణా జిల్లా పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. అవిశ్వాసంపై ఓటు వేయడానికి ముందే.. తాను వైఎస్ కుటుం బానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జోగి రమేష్ చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే వీలులేదని పలుమార్లు ప్రజల సాక్షిగా చెప్పిన టీడీపీ నేత చంద్రబాబు.. ఆ పార్టీతో కుమ్మక్కు అయినందునే అవిశ్వాస సమయంలో అసెంబ్లీ సాక్షిగా పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తనతోపాటు మరికొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచినందుకు గర్వపడుతున్నానని రమేష్ అన్నారు. ఇచ్చినమాట ప్రకారం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో, విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి సైనికుడిలా పనిచేస్తానన్నారు. జగన్‌ను గురువారం కలిసిన వారిలో మచిలిపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత కూడా ఉన్నారు.
Share this article :

0 comments: