ప్రతి ఓటూ జగన్ నిర్దోషిత్వాన్ని రుజువుచేసే ఆయుధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి ఓటూ జగన్ నిర్దోషిత్వాన్ని రుజువుచేసే ఆయుధం

ప్రతి ఓటూ జగన్ నిర్దోషిత్వాన్ని రుజువుచేసే ఆయుధం

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

స్థానిక ఎన్నికల్లో వేసే ప్రతి ఓటూ జగన్ నిర్దోషిత్వాన్ని రుజువుచేసే ఆయుధం
ఉత్తరాఖండ్ బాధితులకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం వితరణ


సాక్షి, గుంటూరు: పల్లెపల్లెలో వైఎస్సార్ సీపీని పటిష్టపరచుకోవడానికి, నాయకత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలే చక్కటి అవకాశమని, దీనిద్వారా మహానేత వైఎస్ ఆశయాలు, జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాలు సాధించుకోవాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని నన్నపనేని వెంకటరత్నం కల్యాణమండపంలో సోమవారం నిర్వహించిన గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. మహానేతపై జనానికున్న ఆదరణను పునాదిగా చేసుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు విజయం సాధించాలని సూచించారు. పల్లెల్లో చిన్నపాటి విభేదాలున్నా వాటిని పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాల న్నారు. ప్రస్తుత పాలకులు రెండేళ్లుగా ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేయడంవల్ల పల్లెల్లో పాలన పడకేసిందని, ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. గెలవలేమనే భయంతోనే రిజర్వేషన్ల సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇవే రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపించారని గుర్తుచేశారు. 

కిరణ్, చంద్రబాబు రహస్య మిత్రులు

స్థానిక ఎన్నికల్లో కుమ్మక్కు రాజకీయాలు నడిపే ప్రమాదం ఉన్నందున వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రహస్య మిత్రులైన కిరణ్, చంద్రబాబు ఎన్నికల్లో కలిసి వస్తారని, డబ్బు, మద్యం, పోలీస్ అండతో సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించినట్లే స్థానిక ఎన్నికలు జరిపిస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. స్థానిక ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని చెప్పేందుకు మంచి అవకాశమని చెప్పారు. నవంబర్ వరకు జగన్‌ను జైల్లో ఉంచేందుకు కుట్ర జరుగుతోందని, ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లి ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, చంద్రబాబు చీకటి ఒప్పందాలు, మహానేత వైఎస్ హయాంలో నెరవేర్చిన హామీలు జనం ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. వైఎస్సార్‌సీపీకి ఎందుకు ఓటెయ్యాలో ప్రజలకు వివరించాలన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో అడ్డుకాబోతున్నాడని కాంగ్రెస్, టీడీపీ జగన్‌మోహన్‌రెడ్డిని అణచివేస్తున్నాయని చెప్పారు. 

పార్టీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని పంచాయతీలు గెలిచి జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు. పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ ప్రకాశం జిల్లా కన్వీనర్ బాలాజీ, పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), రావి వెంకటరమణ, లేళ్ళ అప్పిరెడ్డి, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, తలశిల రఘురాం, కోన రఘుపతి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విజయవాడ నుంచి చిలకలూరిపేట వెళుతున్న విజయమ్మ సమక్షంలో జాతీయ రహదారిపై నంబూరు వద్ద పొన్నూరు నియోజకవర్గానికి చెందిన డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. 
Share this article :

0 comments: