కాకరాపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాకరాపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

కాకరాపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

Written By news on Sunday, June 23, 2013 | 6/23/2013

Photo: Maro prajaprasthanam: 91 constituencies, 35 municipalties, 7 corporations, 160(nearly) mandals, 1500(nearly) villages and met the people nearly 3 crores..2500km..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నిర్వహిస్తోన్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లిలో 2,500 మైలురాయిని అధిగమించింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 24 అడుగుల విగ్రహాన్ని కాకరాపల్లిలో షర్మిల ఆవిష్కరించారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర:
అనంతపురం జిల్లా పెద్దకోట్లలో 100 కిలోమీటర్లు
మహబూబ్‌నగర్‌ జిల్లా శాంతినగర్‌లో 500 కిలోమీటర్లు
నల్గొండ జిల్లా కొండ్రపోలు కాల్వ దగ్గర 1000 కిలోమీటర్లు
కృష్ణా జిల్లా పెడన దగ్గర 1500 కిలోమీటర్లు
పశ్చిమ గోదావరి జిల్లా రావికంపాడు దగ్గర 2వేల కిలోమీటర్లు
తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లిలో 2500 కిలోమీటర్లు 




వైఎస్ ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్, షర్మిలను ఆదరించిన ప్రతిఒక్కరికి నమస్కరిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకరాపల్లిలో జరిగిన షర్మిల బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పది సంవత్సరాల క్రితం చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టడం జరిగింది అని విజయ్మ తెలిపారు. 

ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ మరణంతో ఆకస్మిక మరణానికి లోనైన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చేందుకు చేపట్టిన జగన్ ఓదార్పుయాత్రకు ప్రజలు మద్దతు తెలిపారు. జగన్ జైల్లో ఉన్నందున.. రాలేని పక్షంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ సూచన మేరకు షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారని.. ఇడుపుల పాయలో షర్మిల పాదయాత్ర ప్రారంభించినపుడు చాలా కష్టంగా అనిపించింది అని.. వైఎస్ లేని సమయంలో ఒక బిడ్డ జైలులో, మరో బిడ్డను మీ వద్దకు పంపానని విజయమ్మ అన్నారు. 

ఆరోజు ఓదార్పు యాత్రలో మనవడిగా, అన్నగా, తమ్ముడిగా జగన్ ఆదరించిన విధంగానే.. షర్మిలను కూడా కూతురుగా, చెల్లిగా, మనవరాలిగా ఆదరించిన, ఆశ్వీరదించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. షర్మిల తన 188 రోజుల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో, 2500 కిలోమీటర్లు నడిచారని.. లక్షలాది మంది ప్రజలను కలుసుకన్నారని.. ఇక మీదట కూడా ప్రజలు అదే విధంగా ఆదరిస్తారని..అశ్వీరదిస్తారని కోరుకుంటున్నానని విజయమ్మ అన్నారు. 

జగన్ జైలులో పెట్టి.. రాజకీయాలు చేస్తున్నారని, మరో రాజకీయపార్టీ, పత్రిక ఉండవద్దనే కుట్రతో అనేక కుట్రలు చేస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. పార్టీ గుర్తులేని పంచాయితీ ఎన్నికలతో మన మధ్య చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజయమ్మ కోరారు. 
Share this article :

0 comments: