మహిళలు మంచినీటి సౌకర్యం అడిగితే... ప్రభుత్వం మద్యం తాగడానికి సౌకర్యాలు.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళలు మంచినీటి సౌకర్యం అడిగితే... ప్రభుత్వం మద్యం తాగడానికి సౌకర్యాలు....

మహిళలు మంచినీటి సౌకర్యం అడిగితే... ప్రభుత్వం మద్యం తాగడానికి సౌకర్యాలు....

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై షర్మిల ధ్వజం
ఇంటింటికీ వంటగ్యాస్ వైఎస్‌ఆర్ ఆకాంక్ష...
కిరణ్ సర్కార్ ఇంటింటికీ మద్యం ఇవ్వాలనుకుంటోంది
మహిళలు మంచినీటి సౌకర్యం అడిగితే...
ప్రభుత్వం మద్యం తాగడానికి సౌకర్యాలు కల్పిస్తోంది
మద్యం షాపులను నియంత్రించాలని జగన్ అంటుంటే..
ఈ సీఎం మాత్రం మద్యం వ్యాపారాన్ని పెంచాలంటున్నారు
మహాత్మా గాంధీ ఆదర్శమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ...
ఒక మద్యం మాఫియా డాన్‌ను నాయకుడిగా పెట్టుకుంది
టీడీపీ అధికారంలోకొస్తే చౌక ధరలకే మద్యం ఇస్తారట..
ప్రజలు మద్యంలో మునిగి తేలాలని బాబు ఉద్దేశమా?
విశాఖ జిల్లాలోకి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 189, కిలోమీటర్లు: 2,507.4

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మద్యం పాలసీ ప్రకటించారట. మద్యం దుకాణాల్లోనే కూర్చుని మందు తాగటానికి సిట్టింగ్ రూమ్‌లను అనుమతిస్తున్నారట. అంటే.. ప్రజలకు ఎక్కువ మందుపోసి ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆయన ఆలోచన. పైపు లైన్ వేసి ఇంటింటికీ వంట గ్యాస్‌ను అందించాలని వైఎస్సార్ ఆలోచన చేస్తే.. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇంటింటికీ మద్యం సర ఫరా చేయాలని అనుకుంటోంది. ముఖ్యమంత్రి గారూ.. మాకు మరుగుదొడ్లు కట్టించండని మహిళలు అడుగుతుంటే.. ఈ ముఖ్యమంత్రి మద్యం దుకాణాలకు సిట్టింగ్ రూమ్‌లను పెట్టించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరిని ఎండగడుతూ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 11 జిల్లాలను పూర్తి చేసుకొని, సోమవారం 12వ జిల్లా విశాఖలోకి అడుగుపెట్టింది. షర్మిల తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లి దాటి, గన్నవరంమెట్ట గ్రామం ద్వారా విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించారు. తనకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగం సారాంశం ఆమె మాటల్లోనే..
‘‘జగనన్న మద్యం దుకాణాలను నియంత్రించాలని, మద్యం అమ్మకాలను అదుపు చేయాలని అంటుంటే.. ఈ ముఖ్యమంత్రి టార్గెట్లు పెట్టి మరీ మద్యం విక్రయాలు జరిపిస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే పోటీలు పెట్టి ఎక్కువ తాగిన వారికి బహుమతులు కూడా ఇచ్చేటట్టున్నారు. కేవలం నాలుగేళ్లలో ఎక్సైజ్ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగారంటే మద్యం అమ్మకాల మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. 

మహాత్మాగాంధీ ఆదర్శం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మద్యం మాఫియా డాన్‌ను పట్టుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్నదంటే ఇక ఏమనాలో అర్థం కావడంలేదు. మన ఖర్మకొద్దీ పాలకపక్షం ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం ఇంకా దరిద్రంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పాదయాత్ర చేస్తూ.. మద్యం వలన బుగ్గిపాలైన కుటుంబాలను కళ్లారా చూశారు. మహిళల రోదన విన్నారు. కనీసం ఆయనైనా ఈ మద్యాన్ని నియంత్రించడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాడేమో అనుకుంటే.. ఆయనేమో టీడీపీ అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే మద్యం అందుబాటులోకి తెస్తారట. అంటే.. ప్రజలు మద్యం మత్తులో మునిగి తేలాలని ఆయన ఉద్దేశం. ప్రజల జీవితాన్ని కాల్చుకుతింటున్న వీళ్లను నాయకులు అనాలా? లేకుంటే నీచులు, దుర్మార్గులు అనాలా?

చంద్రబాబు ‘మనసులో మాట’ అని ఒక పుస్తకం రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చూపించారు. ఉచిత విద్యుత్తు ఇవ్వనే కూడదని రాసుకున్నారు. సబ్సిడీ ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని రాసుకున్నారు. ఇక పన్నుల గురించి, యూజర్ చార్జీల గురించి ఏమన్నాడో ఆయన మాటల్లో మీ కోసం చదువుతున్నాను. ‘పన్నులను, యూజర్ చార్జీలను పెంచడానికి ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడానికి నేను నిశ్చయించుకున్నాను. 

విద్యుత్తు, తాగు నీరు, సాగు నీరు, రవాణా మొదలైన వాటికి సున్నితంగా చార్జీలు వసూలు చేయాలి. పన్నుల రాబడి పెంచుకోవాలి. అర్జంటుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉచిత సేవల కాలం చెల్లిపోయింది, ఎల్లిపోయింది. ప్రజల నుంచే డబ్బును సేకరించాలి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తును ఎక్కువ శాతం వినియోగించుకునేది రైతులే కాబట్టి ఆ భారం భరించలేనిది అవుతోంది. ప్రజలను ముందుగానే సంసిద్ధం చేసినప్పుడు పెంచిన ధరలను వాళ్లు మరింత తేలికగా అంగీకరిస్తారు’.. ఇదీ చంద్రబాబు గారి మనుసులోని మాట. చెరువులో ఉన్న ఒక కొంగ తాను శాకాహారిగా మారానని జపం చేస్తూ, ఆ చెరువులోని చేపలన్నింటినీత తినేసిందట.. ఆ మాయ కొంగలాంటివాడు ఈ చంద్రబాబునాయుడు. ఇంకొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు, ఆ తరువాత మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని టీడీపీ, కాంగ్రెస్ నాయకుల ధీమా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏది ఉన్నా, ఏది లేకపోయినా దేవుని దయ, మీ దీవెన ఉందని మీరు నిరూపించాలి. ఓటు అనే ఆయుధంతో టీడీపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన రోజున జగనన్నను మీరు ఆశీర్వదించినట్లు అవుతుంది. మీరు వేసే ప్రతి ఓటు జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని మీరు నమ్ముతున్నట్లు అవుతుంది.

శరభవరంలో షర్మిల బస: సోమవారం 189వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లి నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరంమెట్ట గ్రామం చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి మన్యపురట్ల కూడలి గుండా నడిచి ఎ.శరభవరం చేరుకున్నారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45 గంటలకు చేరుకున్నారు. మొత్తం 6.9 కిలోమీటర్లు నడిచారు. 

ఇప్పటివరకు మొత్తం 2,507.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు ఎంవీ మైసూరారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, విశాఖ జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు సుభాష్‌చంద్రబోస్, బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు వరపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, గండి బాబ్జి, చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, మహిళా విభాగ కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెలమలశెట్టి సునీల్, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పొంగులేటి శ్రీనువాసరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్, కోలా గురువులు, కోరాడ రాజబాబు, కుంభ రవిబాబు, కె.సర్వేశ్వరరావు, ప్రగడ నాగేశ్వరరావు, ప్రసాద్, పాడేరు శాంతమ్మ, మంగపతిరావు, మాడ్గుల ముత్యాలనాయుడు, తిప్పల నాగిరెడ్డి, కొత్తపల్లి గీత తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: