జనం కోరుతున్నది జగన్ నాయకత్వాన్నే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం కోరుతున్నది జగన్ నాయకత్వాన్నే

జనం కోరుతున్నది జగన్ నాయకత్వాన్నే

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

జగనన్నా!
పుట్టుకతోనే నువ్వు మహారాజువన్నా 
ప్రజాధనం తినే తత్త్వం నీ రక్తంలో లేదన్నా 
నిన్ను వేలెత్తి చూపేవారే అసలైన దొంగలన్నా 
స్వార్థపరులు కోరుతున్నది అసమర్థపాలన
నిస్వార్థజనం కోరేది న్యాయపరమైన నీ సమర్థపాలన
పోనున్నది పనికిమాలిన పాలన
రానున్నది రాజన్న పసిడి పాలన
ఆ... పాలననే జనం కోరుకున్నది
నీ నాయకత్వం అది తీర్చనున్నది
జనం బలం ఉన్న ఏకైక నేతవు నువ్వేనన్నా
నీతో పోటీ చేసే దమ్ము ఎవరికీ లేదన్నా
రేపటి ముఖ్యమంత్రివి నువ్వేనన్నా
ప్రజలు ఎదురుచూస్తున్నది ఆ శుభతరుణం కోసమేనన్నా
ఇదే జనం ఉద్దేశం... ఇదే ఆ దేవుడి సందేశం.

- డి.యు.ఆర్, తిరుపతి

కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కై క్విడ్ ప్రోకో రాజకీయాలు చేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగాక ఎందరో ముఖ్యమంత్రులుగా చేశారు కాని, ‘నేను అందరిలాంటి ముఖ్యమంత్రిని కాదు’ అన్నట్లు వైయస్సార్‌ప్రజాసంక్షేమం అనే పల్లకిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఓ బోయీలా మోశారు. అలాంటి నాయకుడి కుటుంబానికి కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడు అన్యాయం చేస్తోంది. జగన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నీతిమంతుడని, కాంగ్రెస్ ను వీడాక అవినీతిపరుడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. నమ్మడానికి ప్రజలు అంత అమాయకులు కారు. అవినీతిని కన్నబిడ్డలా, అభివృద్ధిని పెంపుడు బిడ్డలా పెంచి పోషించిన ఈ కాంగ్రెస్ పెద్దలు గురువిందగింజ సామెతలా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కుంభకోణాలన్నీ వాళ్లే చేస్తూ, అభంశుభం తెలియని జగన్‌ను అరెస్టు చేయించారు. కానీ సీబీఐ ఇంతవరకు ఏ ఒక్క విషయంలో రుజువులు చూపలేకపోయింది. 

నిర్దోషి అయిన జగన్‌ను దోషి అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. బెయిల్‌కు ప్రయత్నించినప్పుడల్లా కుంటిసాకులు చెప్పి న్యాయస్థానాలను ప్రభావితం చేస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అందరూ అనుకూలంగా పనిచేస్తారనే భావన ప్రజల మనసులో నాటుకుపోవడానికి కారణం సీబీఐ వంటి సంస్థల నిర్వాకమే. 

నిరుటి ఉపఎన్నికల్లో జగన్‌తోనే జనం అని తేలిపోయింది. పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికల్లో నెగ్గడం కష్టమన్న భయంతో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. విడివిడిగా ఉంటే ఏమీ చేయలేమని శత్రువు శత్రువు కలిసి మిత్రులైనట్లు ‘క్విడ్ ప్రోకో’ రాజకీయాలు చేస్తున్నాయి. బాబుగారికి, ప్రస్తుతం ఆయన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

- ప్రసాద్, ఊరిపేరు రాయలేదు
Share this article :

0 comments: