రాజ్యాంగ హక్కులు అపహాస్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్యాంగ హక్కులు అపహాస్యం

రాజ్యాంగ హక్కులు అపహాస్యం

Written By news on Saturday, June 29, 2013 | 6/29/2013

- వైఎస్ జగన్‌ది కచ్చితంగా అక్రమ నిర్బంధమే
- ‘చైతన్యపథం’లో మార్కాపురం వాసులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆధారాలు లేకుండా కేవలం అభియోగాలతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిపైగా నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని మార్కాపురం ప్రజలు ధ్వజమెత్తారు. కేవలం అభియోగాలపైనే ఇంతకాలం అక్రమంగా రిమాండ్‌లో ఉంచుతారా? నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసేంత దుస్సాహసానికి సీబీఐ ఎందుకు తెగించింది? నాలుగు నెలల తరువాత మళ్లీ గడువు కోరుతామని సీబీఐ న్యాయవాది అశోక్‌భాన్ ఏమాత్రం జంకులేకుండా ఎలా ప్రకటిస్తారు? రాజ్యాంగ నియమావళి ప్రకారం కాకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే సీబీఐ ఇంతగా దిగజారి వ్యవహరిస్తోంది... అని పట్టణ ప్రముఖులు విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ‘సాక్షి చైతన్యపథం’ సదస్సును శుక్రవారం నిర్వహించారు. 

నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పట్టణవాసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కఫార్డు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కె.ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రితో పాటు బొగ్గు కుంభకోణంలో పాత్ర ఉన్న సోనియా గాంధీ కుటుంబ సభ్యులను కాపాడేందుకే సీబీఐ ఆ కేసును నీరుగారుస్తోందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసులో మాత్రం విచారణను పూర్తి చేయడం మీద దృష్టిపెట్టకుండా ఆయన్ని ఎంతకాలం రిమాండ్‌లో ఉంచుదామా అనే సీబీఐ యత్నిస్తోందని విమర్శించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.ఎల్.ప్రసాద్‌యాదవ్, న్యాయవాది జి.గాంధీరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్రను అమలు చేసే ఏజెన్సీగా సీబీఐ రూపాంతరం చెందిందని విమర్శించారు. 

టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పెట్టుబడులను ప్రశ్నించని కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ... సాక్షి పెట్టుబడులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని నీటి సంఘం అధ్యక్షుడు వెలుగొండారెడ్డి విమర్శించారు.
Share this article :

0 comments: