హవాలా డబ్బు తరలించేందుకే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హవాలా డబ్బు తరలించేందుకే..

హవాలా డబ్బు తరలించేందుకే..

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

టీడీపీ అధినేత చంద్రబాబు హవాలా మార్గంలో విదేశాల నుంచి నల్ల ధనాన్ని తరలించేందుకే అమెరికా పర్యటనకు వెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ ఆరోపించారు. 1995 నుంచి చంద్రబాబు చేసిన విదేశీ పర్యటనలు, ఎన్టీఆర్ ట్రస్టుకు విదేశాల నుంచి వచ్చిన నిధులపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. అమెరికాలో చంద్రబాబు హవాలా లావాదేవీలపై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ తరపున లేఖ రాస్తామన్నారు. జనక్‌ప్రసాద్ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కీలకమైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు వాటిని విస్మరించి విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. 2004, 2009 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇలాగే విదేశాలకు వెళ్లి హవాలా మార్గంలో పెద్దఎత్తున నిధులను తెచ్చారని చెప్పారు. అమెరికాకు నిధుల కోసం వెళ్లాననే విషయం కప్పిపుచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు వచ్చీ రాగానే ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్‌లో హైడ్రామా చేశారని వ్యాఖ్యానించారు. 
10 రోజులు ఏం చేశారు?: 2014 ఎన్నికల్లో ఎలాగోలా గెలవకుంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించిన చంద్రబాబు రూ. 500 కోట్లను హవాలా మార్గంలో తరలించటానికే అమెరికా వెళ్లారని జనక్‌ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబు అమెరికా వెళ్లింది విదే శాల నుంచి నిధులు తేవడానికేనని కొన్ని జాతీయ పత్రికలు కూడా కథనాలు రాశాయని వాటి పత్రికా క్లిప్పింగ్‌లను జనక్ ప్రసాద్ మీడియాకు చూపారు. వ్యక్తిగత పనులపై నాలుగు రోజుల పాటు విదేశాలకు వెళుతున్నానని చెప్పిన చంద్రబాబు అక్కడ పది రోజులున్నారని అన్ని రోజులు ఏం చేశారో విచారణ జరిపించాలని సూచించారు. చంద్రబాబు, ఆయన కుటుంబీకుల పాస్‌పోర్టులను ఒక్కసారి పరిశీలిస్తే వారు ఎక్కడెక్కడికి వెళ్లారో తెలిసిపోతుందన్నారు. 

సుజనా కంపెనీల ద్వారా తరలింపు..: చంద్రబాబుకు క్యాబినెట్ హోదా, జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తే ప్రజల కోసం ఆయన చేసిందేమిటని జనక్‌ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి పలు బోగస్ కంపెనీలున్నాయని, 20 కంపెనీల నుంచి చంద్రబాబు రూ. వందల కోట్లు భారతదేశానికి హవాలా రూపంలో తరలించారని చెప్పారు. గతంలో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ అంశాలను పొందుపర్చారని అయితే సాంకేతిక కారణాల వల్ల తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థలను దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని కూడా కోర్టు సూచించిందని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టిన చిరంజీవికి అసలు జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని దుయ్యబట్టారు. నీతి గురించి మాట్లాడుతున్న చిరంజీవి చెన్నైలో ఆయన వియ్యంకుడి ఇంట్లో మంచం కింద దొరికిన 40 కోట్ల రూపాయల మాటేమిటో చెప్పాలని అన్నారు. ఏడాదిగా జగన్‌ను అకారణంగా జైల్లో నిర్బంధించినా ఇంత వరకూ ఆయన అవినీతి చేసినట్లుగా నిరూపించ లేకపోయారని జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. 
Share this article :

0 comments: