విజయమ్మకు నల్లగొండ జిల్లా ప్రజల బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మకు నల్లగొండ జిల్లా ప్రజల బ్రహ్మరథం

విజయమ్మకు నల్లగొండ జిల్లా ప్రజల బ్రహ్మరథం

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

- స్థానిక ఎన్నికలలో అప్రమత్తత అవసరం 
- ప్రతి పంచాయతీపై పార్టీ జెండా రెపరెపలాడాలి
- విజయమ్మకు నల్లగొండ జిల్లా ప్రజల బ్రహ్మరథం 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/కోదాడ, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై దృష్టి సారించి పోరాటం చేయాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కోదాడలో బుధవారం జరిగిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో విజయమ్మ రెండోరోజు నిర్వహించిన సమావేశానికి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేటలో ని ర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన విజయమ్మను చూసేందుకు రోడ్డు వెంబడి పెద్ద ఎత్తున ప్రజలు ఎదురు చూడగా బుధవారం కోదాడలో వైఎస్‌ఆర్ విగ్రహావిష్కర ణకు బయలుదే రినప్పటి నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు వేల మంది ప్రజలు ఆమె వెంట నడిచారు. 

కార్యకర్తల సమా వేశంలో విజయమ్మ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలను అడ్డుకోవాలని, ఓటర్ల జాబితాపై నిఘా పెట్టటంతో పాటు నామినేషన్ల దాఖలు మొదలు ఫలితాలు వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి పంచాయతీపై పార్టీ పతాకం రెపరెపలాడాలన్నారు. ముందుగా పార్టీల వారీగా జరిగే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, పార్టీరహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గెలిచినవారు తమ పార్టీవారేనని చెప్పుకొనేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.

స్థానిక ఎన్నికల్లో నిలబడేవారు జాగ్రత్తగా ఉండాలని, అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై వైఎస్సార్ సీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు. కొందరు నాయకులు పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటేస్తే సార్వత్రిక ఎన్నికల్లో సహకరిస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆ మాయమాటలను నమ్మవద్దని కోరారు. చంద్రబాబునాయుడి పాలనలో స్థానిక సంస్థలకు చెందిన రెండువేల కోట్ల రూపాయల్ని పక్కకు మళ్లించారని చెప్పారు. వైఎస్ హయాంలో మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లించేదని, ఇప్పుడు పంచాయతీయే చెల్లించాలనడంతో గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయని పేర్కొన్నారు. 

ప్రజాపక్షపాతి వైఎస్: ప్రజాపక్షపాతి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి తన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారని చెప్పారు. చంద్రబాబు 37 సంవత్సరాల రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, చీకటి ఒప్పందాలేనని చెప్పారు. 

చంద్రబాబు అధికారం కోసం 1999లో బీజేపీతో, 2009లో టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేశారని... ఈ రెండు సందర్భాల్లో తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వ్యక్తిగతంగా ఎదిగే నాయకులపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దాడులు చేయిస్తోందని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మారిన 15 రోజులకే నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు. కుట్రలు, కుతంత్రాలను అధిగమించి జగన్‌మోహన్‌రెడ్డి జైలునుంచి బయటకు వచ్చి వైఎస్ స్వర్ణయుగం తీసుకొస్తారని పేర్కొన్నారు. తొలుత తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారికి, వైఎస్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మ బలిదానాలు చేసిన వారికి నివాళులర్పించారు.

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయానికి బలైన వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో పార్టీ దక్షిణ తెలంగాణ జిల్లాల కో ఆర్డినేటర్ జిట్టా బాలకృష్ణారెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల కో ఆర్డినేటర్ కె.కె.మహేందర్‌రె డ్డి, సీజీసీ సభ్యుడు, ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీందర్‌నాయక్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, నల్లగొండ, మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు వడ్డేపల్లి నర్సింగరావు, గున్నం నాగిరెడ్డి, జిల్లా క న్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, సీఈసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిశీలకుడు గాదె నిరంజన్‌రెడ్డి, కోదాడ కో ఆర్డినేటర్ ఎర్నేని వెంకటరత్నం (బాబు), దేవరకొండ నియోజవకర్గ కో ఆర్డినేటర్ సురేష్ నాయక్, గోనె ప్రకాశ్‌రావు, పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ విగ్రహావిష్కరణ
సభ అనంతరం పట్టణంలో కార్యకర్తలంతా వెంటరాగా ర్యాలీగా వెళ్లిన విజయమ్మ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోదాడ ప్రాంత లంబాడి యువతులు తమ సంప్రదాయ దుస్తులను విజయమ్మకు బహూకరించారు.
Share this article :

0 comments: