పంచాయతీలకు 10% స్థలం ఇవ్వాల్సిందే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంచాయతీలకు 10% స్థలం ఇవ్వాల్సిందే!

పంచాయతీలకు 10% స్థలం ఇవ్వాల్సిందే!

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

* అప్పుడే లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి
* పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: పదిశాతం ఖాళీ స్థలాలను గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్ చేసిన తరువాతే.. ఆ లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. కొత్తగా వచ్చే లే అవుట్‌లే కాకుండా.. ఇప్పటికే అనుమతిపొందిన లే అవుట్‌లలో నిర్మాణాలు పూర్తికానిచోట కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాక లే అవుట్‌లలో రహదారుల వెడల్పు కనీసం 33 అడుగులు ఉండాలని నిర్ణయించారు. అంతకన్నా తక్కువగా ఉన్నచోట ఈ మేరకు విస్తరణ కోసం ఇరువైపులా ప్లాట్ల యజమానులు సహకరించేలా ఒత్తిడి తేనున్నారు. అనధికార లే అవుట్‌ల క్రమబద్దీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టరాదని నిర్ణయించినట్లు సమాచారం. 

స్థానిక సంస్థల్లోని స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ఈ స్థలాలను ఇతరత్రా కార్యక్రమాల వినియోగానికి కేటాయించడం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారుల సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయించారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్తరంజన్ బిశ్వాల్, కమిషనర్ సునీల్‌శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: