జన హృదయ స్పందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన హృదయ స్పందన

జన హృదయ స్పందన

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

ఎటు చూస్తే అటు వెల్లువలా జనం. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి జననేత ప్రసంగాన్ని మనసారా వింటున్న ప్రజానీకం. తమ బాధలను, అందుకు కారణాలను, పరిష్కార మార్గాలను ఆయన విశదీకరిస్తూ ఉంటే ఆసక్తిగా వింటూ, కరతాళ ధ్వనులతో అభినందిస్తున్న అభిమాన జన సందోహం.. మరి వారి అంతరంగంలో కదిలే ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుకు సమాధానం ఇదీ... - న్యూస్‌లైన్ , ఎస్.రాయవరం

బాగా సెబుతున్నాడు...
జగన్‌ను చూడ్డానికొచ్చినా. మా గురించి మాబాగా సెబుతున్నాడు. మా బతుకుల గురించి బాగా తెలిసినట్టు మాటాడతన్నాడు. జగన్ గురించి ఏదేదో సెబుతున్నారు కానీ నమ్మడం లేదు. మమ్మల్ని (మత్స్యకారులను) ఎవరూ పట్టించుకోవడంలేదు. పెభుత్వం నుంచి ఏమీ రావడం లేదు. జగన్ వస్తున్నాడంటే ఊల్లో పండగలా ఉంది. 
- ఎరిపిల్లి భూలోకమ్మ, రేవుపోలవరం 
రాజన్న బిడ్డను సూడాలని..
రాజన్న బిడ్డ వచ్చేడు. ఊల్లో సందడేత్తాంది. జగన్‌ను సూడ్డానికి ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసినాను. మునుపు మా ఊల్లో ఎన్టీవోడి పార్టీ ఉండేది.. రాజన్న బాబు మంచి పనులతో అంతా జగనే అంటున్నారు. జగన్ వచ్చాడని అంతా సంబరపడతన్నారు. మంచి పనులు చేస్తాడని చెప్తన్నారు. ఎలచ్చన్లంటగదా అందరు జగన్‌కే ఓట్లేత్తారు. 
- బాపనమ్మ, రేవుపోలవరం
అన్నీ ఇత్తాడు...
అంతా జగనేనంటన్నారు. మా ఊల్లకు ఏం జరగలే. అదిగో ఇదిగో అంటన్నారు. మాకేం లేకండా మింగేత్తన్నరు. రాజన్న కొడుకు వచ్చాడుగా ఇక అంతా మంచే జరగతందంటన్నరు. ఊల్లో పించన్లు లేవు, కోటా కార్డుల్లేవు. ఇల్లు లేవు. రాజన్న పెబుత్వం వస్తే అన్నీ వస్తాయంటన్నరు. జగన్ చెప్పాడుగా అన్నీ ఇత్తడు.
- గంగ, కొత్తరేవుపోలవరం

సాయం సేత్తాడు..
ఊళ్లోకి జగన్ వస్తన్నాడని చేపలు అమ్ముకోడానికి ఎల్లలేదు. అంద ర్ని భలే పలకరిత్తన్న డు. మా బతుకులు గురించి బాగా తెలి సినట్టుంది. అన్నీ మాట్టాడతన్నాడు. చాలా మంది వత్తన్నారు కాని ఇలా సె ప్పడం లేదు. అదిసేత్తాం.. ఇది సేత్తాం అనేసి పోతన్నరు. జగన్ అన్నీ సేత్తాడని నమ్మకమేత్తంది.
- పోలమ్మ, కొత్తరేవుపోలవరం 
తండ్రికి తగ్గ తనయుడు
జగన్‌ను ప్రత్యక్షం గా చూడడం ఇదే మొదటిసారి. రాజ శేఖరరెడ్డిగారిని చూశాను.ఇప్పుడు ఆయన కొడుకును కూడా చూడడం ఆనందం కలిగించింది. తండ్రికి తగ్గవాడనిపిస్తోంది. జగన్‌ను చూడడానికి 20 కిలోమీటర్ల దూరం నుంచి మూడు గ్రామాల ప్రజలం వాహనాలు ఏర్పాటుచేసుకుని ఇక్కడకు వచ్చాం.
- బంగారులక్ష్మి, వెంకటాపురం 
జగన్‌తోనే సంక్షేమం
జగన్‌ను చూడడానికి మా ఊరు నుంచి ఆరు వాహనాల్లో స్వయంగా ఇక్కడికి వచ్చాం. రాజన్న చనిపోయాక మాకు సంక్షేమ పథకాలేమీ అందలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆ పథకాలన్నీ మాకు అందుతాయని నమ్ముతున్నాం. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటాం.
- డి.కృష్ణవేణి, లింగరాజుపాలెం
Share this article :

0 comments: